Tuesday, April 23, 2024

అదానీ గ్రూప్ మార్కెట్ నష్టాలు రూ. 8 లక్షల కోట్లు!

- Advertisement -
- Advertisement -

ముంబై: గౌతమ్ అదానీ నేతృత్వంలోని సమ్మేళనం(కాంగ్లోమెరేట్) గురువారం భారీగా నష్టపోయాయి. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ రూ. 20000 కోట్ల ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పిఓ) ను ఉపసంహరించుకోనున్నట్లు ప్రకటించారు. మదుపర్ల డబ్బులను వెనక్కి ఇస్తామని కూడా అదానీ ఎంటర్‌పైజెస్ ప్రకటించింది. వాస్తవానికి ఆ ఎఫ్‌పిఓ పూర్తిగా సబ్‌స్క్రయిబ్ అయింది. అయితే దానిని ఉపసంహరించుకోవాలని తీసుకున్న నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. మార్కెట్‌లో ఉన్న హెచ్చుతగ్గులను బుధవారం గమనించాక ఆ కంపెనీ ఎఫ్‌పిఓ విషయంలో ముందుకు వెళ్లడం మంచిది కాదని నిర్ణయించుకుంది. ‘నా దృష్టిలో నా మదుపరుల ప్రయోజనాలే అతి ముఖ్యం. మదుపరులు మరింతగా నష్టపోకుండా ఉండేందుకే నేను ఎఫ్‌పిఓను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నాను’ అని అదానీ అన్నారు.

స్కూల్ డ్రాపవుట్ నుంచి బిలియనీర్‌గా మారిన గౌతమ్ అదానీకి ఇటీవల ఎదురుగాలి వీచేసరికి ‘అదానీ ఎంటర్‌ప్రైజెస్’ ఎఫ్‌పిఓను ఉపసంహరించుకున్నారు. హిండెన్‌బర్గ్ నివేదిక దెబ్బకి ఆయనకు చుక్కలు కనిపించాయి. ఆసియాలో అత్యంత సంపన్నుడిగా గుర్తింపు పొందిన ఆయన తన స్థానాన్ని కూడా కోల్పోయాడు. ఆయనకు చెందిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, అదానీ టోటల్ గ్యాస్, అదీనీ గ్రీన్ ఎనర్జీ అండ్ అదానీ ట్రాన్స్‌మిషన్ షేర్లు దాదాపు 10 శాతంకుపైగా పడిపోయాయి, ఇక అదానీ పవర్, అదానీ విల్మర్ 5 శాతం మేరకు పడిపోయాయి. ఫోర్బ్ జాబితాలో ప్రస్తుతం అదానీ ప్రపంచ సంపన్నులలో 16వ స్థానంలో ఉన్నారు. గత వారం ఆయనకు మూడో స్థానం ఉండింది. అదానీ షేర్లపై మదుపరులకు నమ్మకం సన్నగిల్లింది. పన్ను ఉండని దేశాల నుంచి అదానీ గ్రూప్ అక్రమరీతిలో స్టాక్ మ్యానిపులేషన్‌కు పాల్పడుతోందని హిండెన్‌బర్గ్ గత వారం ఆరోపించింది.హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ స్టాకులు పతనమయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News