Thursday, April 25, 2024

ఎంఎస్‌సిఐ ఇండెక్స్ నుంచి అదానీ యూనిట్లు నిష్క్రమించొచ్చు: విశ్లేషకులు

- Advertisement -
- Advertisement -

ముంబై: అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలానాత్మక నివేదిక శుక్రవారం తీవ్రస్థాయికి చేరుకోవడంతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు రెండు సెషన్లలో మార్కెట్ విలువలో 30 బిలియన్ డాలర్లకుపైగా నష్టపోయాయి. ‘స్మార్ట్‌కర్మ’ కథనం ప్రకారం అదానీ ఎలక్ట్రిక్ యుటిలిటీ సర్వీస్, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్లు ఈ నెలలో మోర్గాన్ స్టాన్లీ కెపిటల్ ఇంటర్నేషనల్(ఎంఎస్‌సిఐ) ఇండెక్స్ తాలూకు ఇండియా గేజ్ నుంచి నిష్క్రమించొచ్చు. ఇది నిష్క్రియ నిధుల(పాసివ్ ఫండ్స్) ద్వారా 500 మిలియన్ల విక్రయానికి దారితీసే అవకాశం ఉంది.

పబ్లిక్ మార్కెట్‌లో స్వేచ్ఛగా ట్రేడయ్యే ఈ రెండు కంపెనీ షేర్ల మొత్తాన్ని ఎంఎస్‌సిఐ సవరించనున్నది. ఫలితాలు కూడా ఈ వారంలో ప్రకటితమవుతాయి. స్వతంత్ర పరిశోధన వేదిక ‘స్మార్ట్‌కర్మ’ విశ్లేషకుడు బ్రియాన్ ఫ్రీటాస్ ప్రకారం సమీక్ష(రివ్యూ) తర్వాత ఈ రెండు కంపెనీలు కనీస స్థాయిని చేరుకోవడంలో విఫలమయ్యే అవకాశం ఉంది.

అదానీ గ్రూపుతో ముడిపడి ఉన్న ఆఫ్‌షోర్ షెల్ కంపెనీలు, నిధులు చాలా వరకు పెద్ద ‘పబ్లిక్’, లేక నాన్‌ఇన్‌సైడర్ షేర్లను కలిగి ఉన్నాయని అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ పేర్కొన్న తర్వాత, ఎంఎస్‌సిఐ మొదటిసారి ఫిబ్రవరిలో సమీక్షించింది. స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసాలకు అదానీ గ్రూప్ కంపెనీలు పాల్పడ్డాయని హిండెన్ బర్గ్ రిపోర్టు ఆరోపించినప్పటి నుంచి అదానీ గ్రూప్ కంపెనీలు కొట్టుమిట్టాడుతున్నాయి. అయినప్పటికీ హిండెన్‌బర్గ్ నివేదికను అదానీ గ్రూప్ పదేపదే ఖండిస్తూ వస్తోంది.

Hindenburg report published

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News