Home తాజా వార్తలు దాని ఫలితమే ‘అద్భుతం’ విజయం

దాని ఫలితమే ‘అద్భుతం’ విజయం

నాగార్జున, సుమంత్, రాజశేఖర్, ప్రభాస్, ఎన్టీఆర్‌లతో పాటు అనేక మంది సినీ సెలబ్రిటీలకు ఫిట్‌నెస్ ట్రైనర్‌గా ఉంటూ.. సినిమాలపై ప్రేమతో ‘అద్భుతం’ చిత్రంతో నిర్మాతగా మారారు చంద్రశేఖర్‌రెడ్డి మొగుళ్ళ. తేజ సజ్జా హీరోగా, హీరో డా.రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్ హీరోయిన్‌గా రామ్‌మల్లిక్ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చంద్రశేఖర్ మొగుళ్ల మాట్లాడుతూ “మా ‘అద్భుతం’ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో టాప్ వ్యూవర్‌షిప్‌తో దూసుకుపోతోంది. అలాగే కేవలం 3 రోజుల్లో 100 మిలియన్ మినిట్స్ వ్యూస్ సాధించి రికార్డు సృష్టించడం మా సంతోషాన్ని మరింత పెంచింది. ఇక దర్శకుడు రామ్‌మల్లిక్ కథను చెప్పిన దానికంటే ‘అద్భుతం’గా తెరకెక్కించాడు. దీనికి తోడు హీరో తేజ, హీరోయిన్ శివాని, ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్ కూడా అద్భుతంగా కుదిరారు. దాని ఫలితమే ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మా ‘అద్భుతం’ విజయం”అని అన్నారు.