Friday, March 29, 2024

సిఆర్‌పిఎఫ్ డిజి కుల్దీప్ సింగ్‌కు ఎన్‌ఐఎ డిజిగా అదనపు బాధ్యతలు

- Advertisement -
- Advertisement -

Additional responsibilities as CRPF DG Kuldeep Singh as NIA DG

 

న్యూఢిల్లీ: జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) డైరెక్టర్ జనరల్‌గా సోమవారం పదవీ విరమణ చేయనున్న వైసి మోడీ స్ధానంలో సిఆర్‌పిఎఫ్ అధిపతి కుల్దీప్ సింగ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించినట్లు హోం మంత్రిత్వశాఖ శనివారం తెలిపింది. అస్సాం-మేఘాలయ క్యాడర్‌కు చెందిన 1984 బ్యాచ్ ఐపిఎస్ అధికారి అయిన వైసి మోడీ ఎన్‌ఐఎ అధిపతిగా 2017 సెప్టెంబర్‌లో బాధ్యతలు చేపట్టారు. ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న వైసి మోడీ స్థానంలో సిఆర్‌పిఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న కుల్దీప్ సింగ్‌కు ఎన్‌ఐఎ డిజిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎన్‌ఐఎ డిజి పోస్టుకు నియామకం జరిగే వరకు ఆయన ఈ పదవిని అదనంగా నిర్వర్తిస్తారని హోం శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్ క్యాడర్‌కు చెందిన 1986 బ్యాచ్ ఐపిఎస్ అధికారి అయిన కుల్దీప్ సింగ్ సిఆర్‌పిఎఫ్ డిజిగా ఈ ఏడాది మార్చిలో నియమితులయ్యారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News