Tuesday, April 23, 2024

ఆదిలాబాద్ కాల్పుల్లో గాయపడ్డ సయ్యద్ జమీర్ మృతి

- Advertisement -
- Advertisement -

adilabad firing incident injured Sayyad Jamir Dead in NIMS

హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఎంఐఎం నేత, మున్సిపల్ మాజీ చైర్మన్ ఫారుఖ్ అహ్మద్ జరిపిన కాల్పుల్లో గాయపడ్డ కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన సయ్యద్ జమీర్ హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారు జామున మృతి చెందాడు. ఆదిలాబాబాద్ జిల్లా ఎంఐఎం అధ్యక్షుడు ఫారూఖ్ జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సయ్యద్ జమీర్‌ను చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్న సయ్యద్ పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం మృతి చెందాడు.ఇటీవల జిల్లా ఎంఐఎం అధ్యక్షుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఫారూఖ్ అహ్మద్ (48) ప్రత్యర్థులపై కాల్పులకు తెగబడ్డాడు. తల్వార్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో మొతేషీన్ నడములోకి ఒక తూటా దూసుకుపోగా, సయ్యద్ శరీరంలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. వెంటనే వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. కాగా చికిత్స పొందుతూ సయ్యద్ మృతి చెందాడు.

మృతుడి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు…

కాల్పుల ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సయ్యద్ జమీర్ ఇంటివద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిందితుడు ఫారూఖ్ అహ్మద్, అతనికి సహాయపడినవారిని కఠినంగా శిక్షించాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఘటన జరిగి వారం గడుస్తున్నా నిందితులను పట్టుకోవడంలో పోలీసుల వైఫల్యం కనిపిస్తోందని జమీర్ బామ్మర్ధి సయ్యద్ మీర్జా ఆరోపించారు. కాల్పులకు సంబంధించిన వీడియో ఆధారాలు ఉన్నా కూడా పోలీసులు నిందితులను అరెస్టు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సమీర్ మృతదేహానికి అంత్యక్రియల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇదిలాఉండగా పోస్టుమార్టం నిమిత్తం జమీర్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ప్రాణం తీసిన పిల్లల క్రికెట్…

తాటిగూడ కాలనీలో నివసించే ఫారూఖ్ అహ్మద్ కుమారుడు, అదే కాలనీలో నివసించే సయ్యద్ మన్నన్ కుమారుడు మోతిషీమ్ ఈనెల 18వ తేదీ శుక్రవారం సాయంత్రం క్రికెట్ ఆడే క్రమంలో గొడవపడ్డారు.కాగా వీరి మధ్య పాత కక్షలు సైతం ఉన్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో తాటిగూడ వార్డు మహిళకు రిజర్వ్‌కాగా ఫారూఖ్ అహ్మద్ భార్య ఎంఐఎం నుంచి, సయ్యద్ మన్నన్ బంధువు బరిలో నిలిచారు. అప్పటి నుంచి వారి మధ్య రాజకీయ విభేదాలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తమ పిల్లలు క్రికెట్ ఆడుతూ గొడవ పడటంతో ఇరు కుటుంబాల వారు పరస్పరం ఘర్షణకు దిగారు. ఈ సమయంలో ఫారూఖ్ అహ్మద్ పాత కక్షల కారణంగా తన వద్దనున్న రివాల్వర్, తల్వార్‌తో దాడికి దిగాడు. సయ్యద్ మన్నన్‌పై తల్వార్‌తో దాడి చేయడంతో ఆయన తలకు గాయాలయ్యాయి.

ఆ తర్వాత చేతిలో ఉన్న రివాల్వర్‌తో కాల్పులు జరపగా సయ్యద్ మన్నన్‌కు మద్దతుగా వచ్చిన ఆయన సోదరుడు సయ్యద్ జమీర్, మోతిషీమ్‌లకు బుల్లెట్ గాయాలయ్యాయి. దీంతో తీవ్రంగా గాయపడిన వారిని రిమ్స్ దవాఖానకు తరలించారు. అయితే సయ్యద్ జమీర్ పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో అక్కడ నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో జమీర్ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఇక కాల్పుల ఘటన అనంతరం ఫారుఖ్‌ను ఎంఐఎం పార్టీ బహిష్కరించిన సంగతి తెలిసిందే. దాంతోపాటు ఆదిలాబాద్ జిల్లా శాఖను కూడా ఆ పార్టీ రద్దు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News