Sunday, March 26, 2023

నకిలీ చలానాల కుంభకోణంలో పెద్దల హస్తం

- Advertisement -

tdpమన తెలంగాణ/కామారెడ్డి: ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మస్థానం తెలుగు దేశం పార్టీయే నని తెలంగాణ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమర్ నాథ్ బాబు బుధవారం కామారెడ్డిలో అన్నారు. జిల్లా కేంద్రంలో ని టిడిపి  పార్టీ కార్యాలయంలో  విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. బోధన్ నకిలీ చలానాల 250 కోట్ల కుంభకోణంలో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. వారి ఆశీస్సుల మూలంగానే దర్యాప్తు నత్తనడకన నడుస్తుందన్నారు. టిడిపి హయాంలో బడుగు బలహీన వర్గాలు అభివృద్ది చెందడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోయిందన్నారు. 17 వేల కోట్లతో మిగులు బడ్జెట్ ఉండగా లక్ష కోట్లకు పైగా అప్పులు పేరుకు పోయాయన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోయిందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు టిడిపి వ్యతిరేకమని ప్రచారం జరిగినప్పటికి రాష్ట్రంలో 20 స్థానాలను  తెలుగు దేశం పార్టీ గెలుచుకుందన్నారు. టిడిపి ప్రోధ్బలంతోనే తెలంగాణ రాష్ట్ర రాష్ట్రం ఏర్పాటుకు కారణమన్నారు. తెలంగాణలో పల్లెపల్లెలో పార్టీకి బలమైన క్యాడర్ ఉందన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం క్యాడర్‌ను భయభ్రాంతులకు గురి చేస్తు తమ పార్టీలోకి తీసుకుంటుందని విమర్శించారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 3500 మంది రైతుల ఆత్మహత్య చేసుకున్నారని రైతు కుంటుంబాలకు 6లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తామన్న కేసీఆర్ ఇప్పటి వరకు ఒక్కరూపాయి చెల్లించిన దాఖలాలు లేవన్నారు. ప్రగతి భవన్ పేరుతో నిర్మిస్తున్న కార్యాలయం పైరవీ భవన్‌గా మారిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలను కాకుండా కేసీఆర్ కుటుంబమే పదవులను అనుభవిస్తుందన్నారు. కాళేశ్వరం పేరుతో ప్రజా ధనం దుర్వినియోగానికి కేసీఆర్ ప్రభుత్వం పాల్పడుతుందని విమర్శించారు. కొత్త సమీకరణాల పేరుతో విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్స్ పేరుతో టిఆర్‌ఎస్‌లో చేర్చుకోవడంపై ఆయన తప్పుబట్టారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించిన కోదండరాం, మందకృష్ణలను అరెస్ట్ చేస్తారా అన్నారు. ఆలీ బాబా 40 దొంగలు రాజ్యమేలుతున్నారని విమర్శించారు. తెలంగాణలో తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో పల్లెపల్లెకు తెలుగు దేశం పార్టీ యాత్రను ప్రారంభిస్తామన్నారు. తెలుగే దేశం పార్టీ కొరకు కొవ్వొత్తిలా కరిగిపోతూ కార్యకర్తలు తెలుగు దేశం పార్టీ పటిష్టానికి కృషి చేస్తున్నారన్నారు. సమావేశంలో జిల్లా టిడిపి అద్యక్షుడు పైడి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో తెలంగాణ తెలుగు దేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకు వస్తామన్నారు. గతంలో జిల్లాలో 9 స్థానాలు గెలుచుకున్న ఘనత టిడిపిదన్నారు. గతంలో జిల్లాలో అన్ని స్థానాలు టిడిపి గెలుచుకుందన్నారు. ప్రస్తుతం మంత్రిగా చలామని అవుతున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్, ఎమ్మెల్సీ గంగాధర గౌడ్, పదవులు అనుభవించిన వారేనన్నారు. ఈ కార్యక్రమంలో నియోజక వర్గ ఇం చార్జి ఎండీ ఉస్మాన్, పట్టణాద్యక్షుడు నజీరుద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి రామస్వామి గౌడ్, కొత్తింటి శ్రీనివాస్ రెడ్డి, మన్నె శ్యాంరెడ్డి, జిలుకర రాజశేఖర్, దర్పల్లి రాజిరెడ్డి, కర్రోళ్ల వెంకట్ గౌడ్, జిల్లాలోని అన్ని మండలాల అద్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News