Thursday, April 18, 2024

కల్తీ విత్తనాలను అరికట్టాలి: నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Niranjan Reddy

 

హైదరాబాద్: నాణ్యమైన విత్తనాల సేకరణపై గ్రామీణ స్థాయిలో అధికారులకు శిక్షణ ఇవ్వనున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. విత్తనోత్పత్తి, మార్కెటింగ్, యాజమాన్య పద్దతులపై రైతులకు అవగాహన కల్పించడానికి మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాప్రతినిధులను కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. కల్తీ విత్తనాలు ఎక్కడైనా ఉంటే అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని, నిషేధిత రసాయనాలు వాడకుండా టాస్క్‌ఫోర్స్ చర్యలు తీసుకుంటుందని నిరంజన్ పేర్కొన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. రబీలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వరిసాగు విస్తీర్ణం పెరిగిందని, పత్తి సాగుపై నియోజకవర్గాల వారీగా అవగాహన కల్పిస్తామని, వారంలో రోజుల్లో అన్ని పంటల వివరాలు సేకరించాలని సిఎం కెసిఆర్ ఆదేశాలు జారీ చేశారన్నారు. అకాల వర్షంతో నష్టం వాటిల్లిన రైతులకు వివరాలు సిఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

 

Adulterated seeds ban in Market says Niranjan reddy

 

Adulterated seeds ban in Market says Niranjan reddy
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News