Home జాతీయ వార్తలు మసాజ్ ముసుగులో వ్యభిచారం

మసాజ్ ముసుగులో వ్యభిచారం

massage-centre

గుంటూరు: గుంటూరులో వ్యభిచార ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మసాజ్ పేరుతో వ్యభిచారం జరుగుతుందని సమాచారం తెలుసుకున్న పోలీసులు శనివారం లక్ష్మీపురంలోని బౌన్స్ బ్యూటీ అండ్ మసాజ్ కేంద్రంపై దాడులు నిర్వహించారు. దాడుల్లో పార్లర్ నిర్వాహకుడు రాంచంద్రరావుతోపాటు అతని అసిస్టెంట్, నలుగురు మహిళలతోపాటు ఒక విటుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి రూ.18 వేలు నగదు, 11 మోబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ మసాజ్ కేంద్రం గత నాలుగేళ్లుగా కొనసాగుతోంది. ఇతర ప్రాంతాలనుండి ఆకర్షణీయమైన అమ్మాయిలను తీసుకొచ్చి నిర్వాహకుడు రామచంద్రరావు తన పార్లర్‌లో వర్కర్లుగా పని చేయిస్తున్నాడు. అయితే నష్టాలు రావడంతో నిర్వాహకుడు రామచంద్రరావు ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. మహిళలతో పురుషులకు మసాజ్ చేయించడంతోపాటు వ్యభిచారం కూడా చేయిస్తున్నాడు. అర్బన్ ఎస్‌పికి వచ్చిన విస్వసనీయ సమాచారం మేరకు పోలీసులు మసాజ్ సెంటర్‌పై దాడి నిర్వహించారు.

Adultery in the pursuit of massage at Guntur Andhra Pradesh