Friday, April 26, 2024

ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు: బైడెన్ హామీ

- Advertisement -
- Advertisement -

Advanced air defense systems for Ukraine:Biden

బైడెన్‌-జెలెన్‌స్కీ ఫోన్‌కాల్‌లో చర్చలు

వాషింగ్టన్ : ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను సరఫరా చేయాలని అమెరికా నిర్ణయించింది. ఈమేరకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి హామీ ఇచ్చారు. రష్యా క్షిపణులతో కీవ్‌పై విరుచుకుపడిన నేపథ్యంలో సోమవారం రాత్రి బైడెన్‌జెలెన్‌స్కీ ఫోన్‌కాల్‌లో మాట్లాడుకొన్నారు. “ ఉక్రెయిన్‌పై క్షిపణి దాడులను బైడెన్ ఖండించారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. రష్యావి మతిలేని చర్యలని ఆయన విమర్శించారు. ఉక్రెయిన్ ఆత్మరక్షణకు అవసరమైన సాయం చేసేందుకు ఆయన హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అందిస్తామని చెప్పారు ” అని శ్వేత సౌధం ఒక ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు రష్యా యుద్ధానికి తగిన మూల్యం చెల్లించేలా మిత్రదేశాలతో కలిసి ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని కూడా జెలెన్‌స్కీకి వివరించారు. అయితే ఏ రకమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను సరఫరా చేస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడితో బైడెన్ చర్చించారో మాత్రం శ్వేతసౌధం వెల్లడించలేదు. గతంలో ఉక్రెయిన్‌కు నేషనల్ అడ్వాన్స్‌డ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్స్ ను ఇచ్చేందుకు అమెరికా అంగీకరించింది.

ఈ వ్యవస్థ రష్యా క్రూజ్ క్షిపణులను సమర్ధంగా ఎదుర్కోగలదు. ఈ సందర్భంగా ఓ అమెరికా సీనియర్ అధికారి మీడియాతో మాట్లాడుతూ గతంలో అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు తరలించిన కొన్ని ఆయుధాల వివరాలను వెల్లడించారు. వీటిలో 1400 స్టింగర్ క్షిపణులు, నిఘా, మల్టిపుల్ మిషన్ రాడార్లు అందించారు.. దీంతోపాటు మిత్రదేశమైన స్లొవాకియా సాయంతో ఎస్300 వ్యవస్థను ఉక్రెయిన్‌కు ఇచ్చారు. దీంతోపాటు ఆగస్టులో బైడెన్ మరో ప్యాకేజీని ప్రకటించారు. వీటిలో 8 ఎన్‌ఎఎస్‌ఎఎం ఎస్ (నేషనల్ అడ్వాన్స్‌డ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్స్) లు ఉన్నాయి. వీటిలో రెండు వ్యవస్థలు రెండు నెలల్లో ఉక్రెయిన్‌కు చేరే అవకాశం ఉంది. మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కూడా ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి దిమిత్రి కులేబాతో సోమవారం మాట్లాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News