– తెలంగాణలో 870 గురుకుల విద్యాలయాలు – విద్యకు వెల కట్టలేం
– గురుకులాల్లో అన్ని రకాల వసతులు కల్పిస్తున్నాం
– ప్రతి విద్యార్థికి రూ.1 లక్ష 25వేల ఖర్చు చేస్తున్న ప్రభుత్వం
మన తెలంగాణ/కామారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో వెనుక బడిన ప్రాంత విద్యార్థుల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలను ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉందని డిప్యూటీ సియం కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం బాన్సువాడ లోని ఎస్సార్‌యన్‌కే ప్రభుత్వ డిగ్రీ కళాశాల 20వ వార్షికోత్సవంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ గాడి తప్పిన తెలంగాణ విద్యావ్యవస్థను సరైన దారిలో పెట్టేందుకు ప్రభుత్వం అనేకచర్యలు తీసుకుంటుందన్నారు. 1996లో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు బోర్లాంలో మహిళారెసిడిన్షియల్ పాఠశాలను ఏర్పా టు చేశామన్నారు. వెనుకబడిన ప్రాంత విద్యార్థుల బంగారు భవిష్యత్తుకోసం కేసీ ఆర్ ప్రభుత్వం విద్యకు అత్యధికంగా నిధులు కేటాయిస్తుందన్నారు. బాన్సు వాడ లో మైనారిటీ గురుకుల పాఠశాల, అలాగే కోటగిరిలో మైనారిటీ బాలుర గురుకుల పాఠశాల నెలకొల్పామన్నారు. బీర్కూర్‌మండల కేంద్రంలో బిసి రెసిడెన్షియల్ పాఠ శాల ఏర్పాటుచేస్తామన్నారు. గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులకు అన్ని రకా ల వసతులను కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులకు ఇంటిని మరిచిపోయే విధంగా నెల కు నాలుగు సార్లు చికెన్, రెండుసార్లు మటన్, ప్రతి రోజు నెయ్యి, గుడ్డుతో పౌష్టికా హారం అందిస్తున్న ఘణత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. గతంలో మెస్ చార్జీలు పెంచాలని ధర్నాలు జరిగేవని ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎవ రు అడుగకముందే అన్ని రకాల వసతులు కల్పిస్తూ విద్యలో ఉన్నత స్థానానికి ఎది గేందుకు ప్రభుత్వ గురుకుల విద్యాలయాల విద్యార్థులపై ఒక్కొక్కరికి లక్షా 25 వేల రూపాయలను ఖర్చు చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మూడున్నర సంవ త్సరకాలంలో అత్యధిక రెసిడెన్షియల్ విద్యాలయాలను స్థాపించిన రాష్ట్రం తెలంగా ణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. తెలం గాణ రాష్ట్రంలో మొత్తం 870 గురుకుల విద్యాలయాల ద్వారా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారన్నా రు. కళా శాలల నుండి పోటీ పరీక్షలకు సన్నద్దమ య్యేందుకు ముఖ్యంగా గ్రూప్స్, సివిల్స్ లో పోటీ పడటానికి అవస రమైన కోచింగ్ తీసుకు నేందుకు విద్యార్థులకు కళాశా లల్లో నే ఏర్పాటు చేశామని అందుకు అయ్యే ఖర్చును నేను వ్యక్తి గతం గానే భరిస్తానని వ్యవ సాయ శాఖ మంత్రి పోచా రం శ్రీనివాస్ రెడ్డి అన్నా రు. లక్ష్మీ కొందరికే ఉం టుందని సరస్వతి ఉంటే లక్ష్మీ అందరిచెంతకు వస్తుందని కష్టపడి చది విన విద్యార్థికి ఉన్నత స్థాయికి చేరుకోవడం సునాయాసమన్నారు. ప్రభుత్వ గురు కుల విద్యా లయాల్లో చది విన విద్యా ర్థులు ఉన్నత స్థానం లో స్థిర పడాలన్నారు. విద్యా ర్థుల బంగారు భవి ష్యత్తు కు గురుకుల విద్యా ల యాలు పునాదులు వేసే లా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అందుకు ప్రతి విద్యార్థికి అయ్యే వసతి, చదువులకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరి స్తుందన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పి ఛైర్మన్ దఫేదర్ రాజు, కలెక్టర్ సత్య నారాయణ, ప్రజా ప్రతినిధులు, అధికారులు , విద్యా ర్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.