Home తాజా వార్తలు రైల్వేలో అధునాతన ట్రైన్ కంట్రోల్ సిస్టమ్

రైల్వేలో అధునాతన ట్రైన్ కంట్రోల్ సిస్టమ్

Railway

రైల్‌టెల్‌తో భారతీయ రైల్వే ఒప్పందం

మన తెలంగాణ / హైదరాబాద్ : బారతీయ రైల్వే వ్యవస్థను పోటీ ప్రపంచానికి అనుగుణంగా ముందుకు సాగుతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైల్వే వ్యవస్థను మరింత ఆధునీకరించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఆధునాతన ట్రైన్ కంట్రోల్ సిస్టమ్ ప్రాజెక్టు కోసం భారతీయ రైల్వే అనుబంధ సంస్థగా ఉన్న రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఆర్‌ఇఎల్) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సంబంధించిన సంతకాలను కూడా పూర్తి చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య తెలిపారు. అవగాహన పత్రం పై రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన రైల్వేబోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ / సిగ్నల్ డెవలప్‌మెంట్ అధికారి ప్రదీప్ ఎం సికిందర్, ఆర్‌ఇఎల్ డైరెక్టర్ / సిఇఓ ఎకె.సబ్లానియాలు, రైల్వేబోర్డు సభ్యుడు ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ విభాగం అధికారి కాశీనాథ్, రైల్‌టెల్ సిఎండి పునీత్ చ్లావా సమక్షంలో సంతకాలు పూర్తి చేసినట్లు జిఎం తెలిపారు. ఈ ఆధునాతన సిగ్నలింగ్ వ్యవస్థలు నాలుగు విభాగాల్లో మొబైల్ ట్రెన్ రేడియో కమ్యూనికేషన్ సిస్టం (ఎంటిఆర్‌సి)పై ఆధారపడుతుందన్నారు. రైల్‌టెల్ సిఎండి పునీత్ పునీత్ చావ్లా ప్రాజెక్టు గురించి వివరిస్తూ ఆర్‌ఇఎల్ బృందం అదే పనిలో నిమగ్నమైందన్నారు. పరిశ్రమల ప్రతినిధుల నుంచి టెక్నాలజీ ఇంటర్‌ఫేజ్ లాంటి అంశాల్లో ఫీడ్‌బ్యాక్ తీసుకున్నట్లు చెప్పారు. పైలెట్ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,609 కోట్లుగా నిర్ధారించారు. 24 నెలల్లో పూర్తి చేయాలనే లక్షంతో ప్రాజెక్టు ఒప్పందం చేసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Advanced Train Control System