Home దునియా సెల్ఫీలు యమ డేంజర్

సెల్ఫీలు యమ డేంజర్

selfieఇప్పుడంతా సెల్ఫీల ట్రెండ్ నడుస్తోంది. సెల్ఫీలు దిగాలి… సోషల్ మీడిమాలో అప్‌లోడ్ చేయాలి.. లైకులు, కామెంట్లు చూసి మురిసిపోవాలి. దీనికోసం ఎంతటి ప్రమాదాన్నైనా లెక్క చేయడం లేదు కొందరు. సెల్ఫీలు తీసుకోవడం వల్ల వచ్చే ఆనందం కన్నా ఆరోగ్య సమస్యలే ఎక్కువంటున్నారు నిపుణులు.  సెల్ఫీ తీసుకునేందుకు ఎక్కువ సమయం సెల్‌ఫోన్‌ను పట్టుకోవడం వల్ల మణికట్టులో సమస్య తలెత్తుతుంది. ఇది కార్పల్‌టన్నెల్ సిండ్రోమ్‌కి దారి తీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మణికట్టులో తీవ్రమైన నొప్పితో పాటు జలదరించినట్లు అనిపించడం ఈ సిండ్రోమ్ లక్షణాలు. ఇలాంటి కేసుల సంఖ్య ఈ మధ్య బాగా పెరిగిపోయిందని వైద్యులు చెబుతున్నారు.

advantage and disadvantage of selfie