Wednesday, April 24, 2024

గణేష్ నిమజ్జనంపై మంత్రుల ఏరియల్ సర్వే

- Advertisement -
- Advertisement -

Aerial survey of ministers on Ganesh immersion

హైదరాబాద్: గణేష్ శోభాయాత్ర, నిమజ్జనాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీలు ఆదివారం నాడు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఈక్రమంలో ఆదివారం మధ్యాహ్నం 1.00 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి బయలుదేరే హెలికాప్టర్‌లో మంత్రులతో పాటు డిజిపి మహేందర్ రెడ్డి, హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ ఏరియల్ వ్యూ నిర్వహించనున్నారు. గణేష్ శోభాయాత్ర, నిమజ్జన ఏర్పాట్ల పై వివిధ శాఖల అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం నాడు మరోసారి సమీక్షించారు. లక్షలాది మంది పాల్గొనే ఈ కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

విగ్రహాల నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ పరిసరాలలో 40 క్రేన్ లను ఏర్పాటు చేయడం జరిగిందని, జిహెచ్‌ఎంసి వ్యాప్తంగా 300 క్రేన్ లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రశాంతంగా శోభాయాత్ర నిర్వహించేలా 27 వేల మంది వివిధ స్థాయిలలోని పోలీసు సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా జనరేటర్లను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ట్యాంక్ బండ్ పరిధిలో 2600 ఎల్‌ఇడి లైట్ లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News