Home అంతర్జాతీయ వార్తలు ఆఫ్ఘన్ అధ్యక్షుని ఎన్నికల ర్యాలీలో పేలుడు: 24 మంది మృతి

ఆఫ్ఘన్ అధ్యక్షుని ఎన్నికల ర్యాలీలో పేలుడు: 24 మంది మృతి

పర్వాన్(ఆఫ్ఘనిస్తాన్): పర్వాన్ ప్రావిన్సు రాజధాని చరికర్‌లో మంగళవారం ఆప్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని పాల్గొన్న ఎన్నికల ప్రచార ర్యాలీలో బాంబు పేలుడు సంభవించి కనీసం 24 మంది మరణించగా మరో 30 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ పేలుడులో అధ్యక్షుడు ఘనికి ఎటువంటి గాయాలు కాలేదు. ఆత్మాహుతి దళ సభ్యుడు బాంబు పేల్చుకోవడం వల్లే ఈ పేలుడు సంభవించినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే, ఈ పేలుడు ఏ ఉగ్రవాద సంస్థ పనో ఇంకా తెలియరాలేదు. ఈ నెలాఖరులో ఆఫ్ఘన్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇలా ఉండగా, ఆఫ్ఘన్ రాజధాని కాబుల్‌లో మంగళవారం జరిగిన మరో పేలుడులో ముగ్గురు మరణించగా పలువురు గాయపడ్డారు.

Afghan president’s rally: Ghani unhurt as blast kills dozens
Another 31 wounded in Charikar explosion, with women and children among the victims, Afghan health official says.