Friday, April 19, 2024

రేపు తాలిబన్ల సర్కారు ఏర్పాటు?

- Advertisement -
- Advertisement -

Afghanistan govt formation by Taliban

అంతా ఇరాన్ తరహా పాలనే

కాబూల్ : అఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల నూతన ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో స్వల్ప జాప్యం ఏర్పడింది. ప్రభుత్వ ఏర్పాటు సంబంధిత విషయాలను శనివారం ప్రకటిస్తామని తాలిబన్ల అధికార ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ శుక్రవారం తెలిపారు. ముందు నిర్ణయించిన ప్రకారం శుక్రవారం నమాజులు తరువాత దేశంలో ప్రభుత్వ స్థాపన ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే ఒక్కరోజు ఈ ప్రక్రియ వాయిదా పడిందని ముజాహిద్ తెలిపారు. ఇందుకు కారణాలను చెప్పలేదు. తాలిబన్ సహ వ్యవస్థాపకులు ముల్లా బరాదర్ నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఉంటుంది. కీలక పదవులలోఎవరెవరు ఉండాలనే విషయం ఇప్పటికీ పంజ్‌షీర్‌లో ఎదురవుతున్న ప్రతిఘటనల నేపథ్యంలో ప్రభుత్వ స్థాపనకు బ్రేక్ పడింది.

అఫ్ఘనిస్థాన్‌లో అధికారం కైవసం చేసుకున్న తాలిబన్లు ప్రభుత్వ రూపురేఖలు ఏ విధంగా ఉండాలనే అంశంపై సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నారు. ఇరాన్‌లోని నాయకత్వపు తరహాలో ప్రభుత్వం ఏర్పాటు ఉండాలని దాదాపుగా నిర్ణయించారు. ఇరాన్‌లో మాదిరిగానే ఇక్కడ తాలిబన్ల మత పెద్ద ముల్లా హెబతుల్లా అఖుంజాదా ప్రభుత్వానికి తెరవెనుక సుప్రీం వ్యక్తిగా ఉంటారు. ఇక ప్రధాన దైనందిన బాధ్యతలను బరాదరి నిర్వహిస్తారని సీనియర్ నేత ఒకరు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుపై సంప్రదింపులు దాదాపుగా పూర్తి అయినట్లు, మంత్రుల నియామకంపై కూడా సంప్రదింపులు తుది దశకు చేరుకున్నట్లు వివరించారు. ఇరాన్‌లో ఉన్న అధికార వ్యవస్థలో భాగంగా అక్కడి ప్రధాన నేత అత్యున్నత స్థాయి రాజకీయ, ఆధ్యాత్మిక నేతగా ఉంటారు. దేశాధ్యక్షుడి కన్నా అత్యధిక అధికారాలతో ఉంటూ సైనికాధికారుల నియామకాలు, ప్రభుత్వ స్థాపనలో తుది నిర్ణయం తీసుకుంటారు. . అదే విధంగా న్యాయవ్యవస్థ కూడా ఆయన ఆధ్వర్యంలోనే ఉంటుంది. అఫ్ఘన్‌లో కూడా ఇదే పద్థతిని పాటిస్తారని స్పష్టం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News