ఆఫ్గనిస్థాన్ కు చెందిన ఓ బుడతడు డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసింది. అయితే, అతడు ఏదో వెరైటీ డ్యాన్స్ చేసి ఉండొచ్చు అందుకే హల్ చల్ చేస్తుందేమో అనుకుంటే పొరపాటు. ఈ బుడతడి పేరు అహ్మద్. గతేడాది జరిగిన ఓ ల్యాండ్ మైన్ పేలుడులో ఒక కాలు పొగొట్టుకున్నాడు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అహ్మద్ కు ఇటీవల కృత్రిమ కాలు అమర్చారు వైద్యులు. మొదట కృత్రిమ కాలిలో నడవడానికే ఇబ్బంది పడ్డ అతడు ఇప్పుడు ఏంచక్కా తన కాలిపై తాను నడవగలుగుతున్నాడు. తాజాగా అదే కాలితో నృత్యం చేస్తుండగా ఒకరు వీడియో తీశారు. మే 8న వరల్డ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రెసెంట్ డే 2019 సందర్భంగా రెడ్ క్రాస్ కమిటీ ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇప్పటి వరకు ఈ వీడియోకు 77వేలకు పైగా వ్యూస్, 2,700 లైక్స్, 970 పైగా రిట్వీట్స్ వచ్చాయి.
Afghanistani Boy Who Lost Leg in Landmine Dancing Video
A landmine took Ahmed's leg.
This is the moment he got back on his feet.
Over 4,000 civilians were killed or injured by explosives in Afghanistan last year. That’s over a third more than in 2017 and the most since 2010. pic.twitter.com/5xVKhTWoiP
— ICRC (@ICRC) May 6, 2019