Wednesday, April 24, 2024

స్పెల్లింగ్ బీ పోటీల్లో విజేతగా ఆఫ్రికన్ అమెరికన్ బాలిక

- Advertisement -
- Advertisement -

African American girl wins Spelling Bee competition

 

వాషింగ్టన్: 2021 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో మొదటిసారిగా ఆఫ్రికన్ అమెరికన్ బాలిక జైలా అవంత్‌గార్డే(14) విజేతగా నిలిచింది. 8వ తరగతి చదువుతున్న జైలా లూసియానా నుంచి విజేతగా నిలిచిన మొదటి బాలిక కూడా. బాస్కెట్ బాల్ క్రీడలో జైలా ఇప్పటికే మూడు గిన్నిస్ ప్రపంచ రికార్డులు సాధించింది. రెండు, మూడు స్థానాల్లో భారతఅమెరికన్ చిన్నారులు నిలిచారు. రెండో స్థానంలో శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన చైత్ర తుమ్మల(12), మూడో స్థానంలో న్యూయార్క్‌కు చెందిన భావనా మాదిని (13) నిలిచారు. అమెరికాలో 14 ఏళ్లలోపు చిన్నారులకు ఈ పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అమెరికాలో నిర్వహించే ఈ పోటీల్లో భారతఅమెరికన్లు 20 ఏళ్లుగా తమ సత్తా చాటుకుంటున్నారు. ఈసారి ఫైనల్ పోటీలకు అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ హాజరయ్యారు. ఆసియా, ఆస్ట్రేలియాలాంటి ఉష్ణమండల ప్రాంతాల్లో ఉండే వృక్షం ‘ముర్రయా’ స్పెల్లింగ్‌ను సరీగ్గా పలకడం ద్వారా ఈ పోటీల్లో జైలా విజేతగా నిలిచింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News