Home జాతీయ వార్తలు 30 దాటితే

30 దాటితే

  • నిజాయితీపరులకు నెమ్మది..
  • అక్రమార్కులకు ముప్పు : ప్రధాని

PM-MODI-MUMBAIముంబయి : అవినీతి పరులకు త్వరలో సమస్యలు మరింత పెరుగుతాయని ప్రధాని నరేంద్రమోడీ హెచ్చరించారు. పెద్దనోట్లు రద్దు చేసినప్పుడు 50 రోజు ల గడువు కోరానని, ఆ గడువు పూర్తయ్యాక అంటే ఈనెల 30 తర్వాత నిజా యితీపరుల ఇబ్బందులు క్రమంగా తగ్గుతాయని, అవినీతిపరుల, నిజాయితీ లేనివారి సమస్యలు మరింత పెరుగుతాయని మోడీ తెలిపారు. శనివారం నాడిక్కడ ఎంఎంఆర్‌డిఎ మైదానంలో ఛత్రపతి శివాజీ విగ్రహ శంకు స్థాపన లో, మెట్రోరైల్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగించారు.రూ.500,రూ.1000నోట్ల రద్దు అనేది సర్కార్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయమని, ఎందుకంటే భారతీయులు అవినీతిని, నల్లధనాన్ని సహించరని అన్నారు.తాను అధికారం చేపట్టిననాటి నుంచి అవినీతిపై పోరాటం ఆరంభించామని ఆయన తెలిపారు. నోట్ల రద్దు అనేది అందులో చరిత్రాత్మకమైనద న్నారు. దీంతో ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ ప్రభుత్వానికి చాలా సహకరిస్తున్నారని ఆయన కొని యాడారు. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోకుండా తమకు మద్దతునిస్తున్నారని చెప్పారు. దేశం ఎదుర్కొం టున్న సమస్యలను అభివృద్ధే పరిష్కరిస్తుందని, దేశ ప్రజల శక్తే ఈ మార్పు తెస్తుందన్నారు. అందుకే ఎన్‌డిఎ సర్కార్ అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతు న్నదని తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ బహు ముఖ ప్రజ్ఞాశాలి అని, శివాజీ వ్యక్తిత్వం అనేక విధాలు గా మనకు స్ఫూర్తి కలిగిస్తుందన్నారు. అనన్య ధైర్యసాహ సాలకు శివాజీ ప్రతీక అని మనకు తెలిసిందేనన్నారు. అయితే సాహసికుడిగానే కాకుండా ఉత్తమ ప్రజా పాల కుడిగా, ఆర్థిక, తాగునీటి రంగాలలో శివాజీ తెచ్చిన సంస్కరణలు, చేసిన పనులు ఎంతో గొప్పవన్నారు.వాటి గురించి మనం తెలుసుకోవాలన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా దేశంలోని సుమారు 18 వేలకు పైగా గ్రామాలు ఇంకా చాలా వెనుకబడే ఉన్నా యని, ఆయా గ్రామాల ప్రజలు ఇంకా 18వ శతాబ్దం లోనే జీవనం వెళ్లదీస్తున్నారని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకుల వైఫల్యాన్ని, ప్రజాసేవ పట్టని తీరును పరోక్షంగా దుయ్యబట్టారు.

శివాజీ స్మారక కేంద్రానికి మోడీ శంకుస్థాపన
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ భారీ స్మారక కేంద్రానికి శనివారం నాడిక్కడ ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. రూ.3.600 కోట్లతో ఈ బ్రహ్మాండమైన స్మారక కేంద్రాన్ని అరేబియా సాగరంలో నిర్మిస్తున్నారు.ఈ శంకుస్థాపనలో ప్రధానితోపాటు గవ ర్నర్ విద్యాసాగరరావు, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్న వీస్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే,శివాజీ చక్రవర్తి వంశానికి చెందిన ఎంపిలు ఉదయన్ రాజే భోసలే, శంభాజీ రాజేలు పాల్గొన్నారు. వీరంతా ముంబయ్ తీరంలోని గీర్‌గావ్ చౌపట్టి బీచ్ నుంచి ప్రత్యేక వాహనం హోవర్‌క్రాఫ్ట్‌లో సముద్రంలో ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న శంకుస్థాపన స్థలికి చేరుకున్నారు. ప్రపంచంలో ఎత్తయిన స్మారక కేంద్రాన్ని నిర్మించాలని రాష్ట్రప్రభుత్వం తలపెట్టింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి తెప్పించిన మట్టి ,నదీజలాలలో నిండిన కలశాన్ని ముందుగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రధానికి అందజేశారు. ప్రధాని మొదట జల పూజాకార్యక్రమాలు నిర్వహించి వాటిని శంకుస్థాపన స్థలిలో కలిపారు. 192 మీటర్ల ఎత్తయిన శివాజీ విగ్రహాన్ని, స్మారక కేంద్రాన్ని అరేబియా సముద్రంలోని ఒక సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రాయిపై నిర్మిస్తున్నారు. అశ్వారూఢు డైన శివాజీ విగ్రహంతో పాటు, ఆడిటోరియం, ప్రదర్శన శాల, యాంఫీథియేటర్ తదితర నిర్మాణాలు ఈ కేంద్రం లో ఉంటాయి.త్వరలో ముంబయ్ నగరపాలక సంస్థలు జరుగనున్న తరుణంలో ఈ కార్యక్రమం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా ఈ నిర్మాణాన్ని పర్యావరణ వేత్తలు,మత్సకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ శంకస్థాపన కార్యక్రమం సందర్భంగా అన్ని జిల్లాల్లో బిజెపి సర్కార్ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది. హోర్డింగ్‌లు,పత్రికల్లో ప్రకటనలు,టివిల్లో ప్రకటనలు విడుదల చేసింది.మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టి నట్టు తెలిసింది. రెండు దశాబ్దాలుగా బిజెపి మద్దతుతో బిఎంసిలో శివసేన అధికారం చెలాయిస్తోంది. ఎన్‌డిఎ లో భాగస్వామి అయినప్పటికీ కేంద్రం తీసుకుంటున్న పలు నిర్ణయాలను శివసేన తప్పుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉద్ధవ్ థాకరేతో ప్రధాని మోడీ మాట్లాడుతూ కనిపించారు.

శివాజీని బిజెపి హైజాక్ చేసింది : శివసేన ధ్వజం
రాజకీయ ప్రయోజనాలు పొందడానికి శివాజీ స్మారక కేంద్ర కార్యక్రమాన్ని బిజెపి హైజాక్ చేసిందని శివసేన అధికార ప్రతినిధి మనీషా కాయండే ఒక ప్రకటనలో విమర్శించారు. లోక్‌సభలో బిజెపి పూర్తి మెజారిటీ సాధించినప్పటికీ అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని చేపట్టడం లేదని ధ్వజమెత్తారు. తమ వైఫల్యాన్ని బిజెపి నేతలు అంగీకరించాలన్నారు. శివాజీ స్మారక కేంద్ర నిర్మాణం అనేది ప్రతి మరాఠాల చిరకాల స్వప్నమనే సంగతి బిజెపి విస్మరించరాదని ఆమె వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం బిజెపి సొంత కాదని, రాష్ట్రప్రభుత్వ కార్యక్రమమని, అన్నిపార్టీలను సమంగా గౌరవించి నిర్వహించాలని ఆమె కోరారు. ప్రభుత్వ, ప్రాధాన్య మున్న కార్యక్రమాలను సొంత ఇమేజ్ పెంచుకోవడానికి వాడుకోవడం బిజెపికి అల వాటేనని ఆమె విమర్శిం చారు. కాగా, గత అక్టోబర్‌లో జరిగిన అంబేద్కర్ స్మారక కేంద్ర శంకుస్థాపన కార్య క్రమంలో వేదికపై ప్రధాని పక్కన సీటు కేటాయించ నందుకు ఆ కార్యక్రమాన్ని ఉద్ధవ్ థాకరే బహిష్కరించిన సంగతి తెలిసిందే.