Friday, March 29, 2024

ఎటిఎం, బ్యాంక్ ఎకౌంట్లు హ్యాక్…. పిఎస్ లో నిందితుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Hacker

 

అగర్తాలా: ఎటిఎం, బ్యాంక్ ఎకౌంట్లను హ్యాక్ చేసే  వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెస్ట్ త్రిపురలో జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సుశాంతా ఘోష్ అనే వ్యక్తి బ్యాంక్ ఎకౌంట్లు, ఎటిఎంలను హ్యాక్ చేసి డబ్బులు తీసుకునేవాడు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు హ్యాకర్ ఘోష్‌ను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. విచారణలో భాగంగా  ఘోష్‌ను రెండు రోజులు కస్టడీలోకి తీసుకున్నారు. శనివారం తెల్లవారుజామున నిందితుడు స్నానానికి అని వెళ్లి రాకపోవడంతో పోలీసులు బలవంతంగా డోర్లు తెరిచారు. అప్పటికే ఘోష్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యగా కేసు నమోదు చేశామని ఎస్‌ఐ చక్రబత్రి తెలిపాడు. గతంలో ఘోష్ 60 ఎకౌంట్లను హ్యాక్ చేసిన కేసులో జైలు పాలయ్యాడు. ఘోష్‌ను హత్య చేసి ఆత్మహత్య చిత్రీకరించారని మానవహక్కుల సంఘం నాయకులు అనుమానం వ్యక్తం చేశారు. హ్యాకర్ ఆత్మహత్యపై జడ్జితో విచారణ జరిపించాలని బంధువులు, మానవ హక్కుల సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. హ్యాకర్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని కుటుంబ సభ్యులు తెలిపారు.

 

Agartala ATM Hacker Committ Suicide in Tripura PS
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News