Home జిల్లాలు హక్కుల సాధన కోసం ఉద్యమించాలి

హక్కుల సాధన కోసం ఉద్యమించాలి

meetingభద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య

ఏటూరునాగారం: రాజ్యంగంలో పొందుపరిచిన హక్కులను సాధించుకోవాలంటే ఏజెన్సీలోని గిరిజనులు ఉద్యమాల ద్వారానే హక్కులను సాధించుకునే అవకాశాలు ఉన్నాయని ప్రతి ఒక్కరు హక్కుల సాధన కోసం ఉద్యమించాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య పిలు పునిచ్చారు. ఏటూరునాగారం మండల కేంద్రంలోని సమగ్ర గిరిజ నాభివృద్ధి సంస్థ(ఐటిడిఎ) కార్యాలయాన్ని సోమవారం సంఘం ఆధ్వ ర్యంలో పెద్దఎత్తున ధర్నాచేసి ముట్టడించారు. ఈ సందర్భంగా రాజ య్య మాట్లాడుతూ 2005లో పార్లమెంట్‌లో అటవి హక్కుల చట్టం బిల్లును ప్రవేశపెట్టిందన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభు త్వాలు ఏజెన్సీలోని గిరిజనులు పోడుచేసుకున్న భూములకు పట్టాలు ఇవ్వకుండా నిర్లక్షం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అటవిశాఖ అధికారులు పోడు భూముల రైతులపై దాడులు చేస్తూ కేసులు పెడుతు న్నారని ఈ విధానాన్ని ఫారెస్ట్ అధికారులు మానుకోవాలని లేనిచో ప్రజల చేతులో శిక్షలకు గురయ్యే ప్రమాదం ఉందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ములుగు డివిజన్ పరిధిలో 50 వేల ఎకరాల పోడు భూములకు ఎలాంటి సర్వేలు నిర్వహించకుండా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహిరిస్తున్నదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పంది ంచి గత కొన్ని సంవత్సరాల నుండి పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతుల భూ ములను సర్వే చేయించి వారికి హక్కు పత్రాలను ఇప్పించా లని ఆయన కోరారు. ఈ ధర్నా కార్యక్రమం సుమారు 2 గంటల పాటు జరిగింది. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఐటిడిఎ ఎపిఓ వసంతరావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ రైతు జిల్లా అధ్యక్షుడు సూడి కృష్ణారెడ్డి, జిల్లా నాయకులు తుమ్మ వెంకటరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి చింత మల్ల రంగయ్య, సిపిఎం మండల కార్యదర్శి దావూద్, మండల రైతు సంఘం అధ్యక్షుడు వసంత నాగయ్యతో పాటు 200 మంది రైతులు పాల్గొన్నారు.