Friday, April 19, 2024

30, 31 తేదీలలో అగ్రికల్చర్ ఎంసెట్

- Advertisement -
- Advertisement -

Agriculture EAMCET on August 30,31

ఆగస్టు 1న ఇసెట్
ఆగస్టు 2 నుంచి 5 వరకు పీజీఈసెట్
వాయిదా పడిన ప్రవేశ పరీక్షల షెడ్యూలు ఖరారు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల దృష్ట్యా వాయిదా పడిన ప్రవేశ పరీక్షల తాజా షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. వాయిదా పడిన పరీక్షల్లో ఎంసెట్, ఇసెట్, పిజిఇసెట్.. ఉండగా వాటి షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఈ నెల 30, 31న ఎంసెట్ (అగ్రికల్చర్)ను నిర్వహించాలని నిర్ణయించింది. ఇసెట్‌ను ఆగస్టు 1న, పిజిఇసెట్‌ను ఆగస్టు 2 నుంచి 5 వరకు నిర్వహించనున్నట్టు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈమేరకు వాయిదా పడిన ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను మంగళవారం ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి వెల్లడించారు. ఎడతెరపి లేకుండా కొనసాగిన వర్షాల కారణంగా విద్యాసంస్థలకు ప్రభుత్వం మొదట మూడు రోజులు సెలవులు ప్రకటించటంతో.. ఈ నెల 13న నిర్వహించాల్సిన ఇసెట్‌ను అధికారులు వాయిదా వేశారు. మిగతా పరీక్షలు యథాతథంగా జరుగుతాయని తెలిపారు. అయితే… జులై 14, 15న భారీ వర్షాలు ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఆ సెలవులను మరో మూడు రోజులు కొనసాగాయి. ఫలితంగా.. ఆ రెండు రోజుల్లో జరగాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను విద్యామండలి వాయిదా వేసింది. కాగా.. 18 నుంచి 20 వరకు జరగాల్సిన ఇంజినీరింగ్ ఎంసెట్ యథాతథంగా నిర్వహిస్తున్నారు.

వాయిదా పడిన ప్రవేశ పరీక్షల షెడ్యూలు..

30, 31న ఎంసెట్ (అగ్రికల్చర్)

ఆగస్టు 1న ఇసెట్

ఆగస్టు 2 నుంచి 5 వరకు పిజిఇసెట్

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News