Home జాతీయ వార్తలు అనాథలకు పోలీసుల పాఠాలు

అనాథలకు పోలీసుల పాఠాలు

Ahmedabad traffic police

 

అహ్మదాబాద్: మన దేశంలో ఎంతో మంది పిల్లలు తల్లిదండ్రులు లేక అనాథలుగా, మరి కొంత మంది నిరాశ్రయులుగా జీవిస్తున్నారు. దీంతో అనాథలు, నిరాశ్రయులు ఫుట్ పాత్ లను వారి నివాసాలుగా చేసుకొని అక్కడే భిక్షాటన చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్ ట్రాఫిక్ డిసిపి అంకిత్ మాట్లాడారు. ఫుట్ పాత్ లపై నివాసం ఉండే చిన్నారుల కోసం అహ్మదాబాద్ ట్రాఫిక్ పోలీసలు ఒక్క వినూత్న ప్రయోగం చేపట్టారు. వారి కోసం మొదట్లో ఒక పాఠశాలను ప్రారంభించి అందులో చిన్నారులకు పాఠ్య బోదన చేశారు.

ప్రస్తుతం పక్వాస్ ఏరియా, దనిల్మిందా, కంకారియా ట్రాఫిక్ సెంటర్లలో మూడు పాఠశాలను నెలకోల్పారు. ఈ పాఠశాలలో 200 మంది విద్యార్థులకు ఉచితంగా చదువుచేబుతూ.. మధ్యాహ్నం భోజనం కూడా అందిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్ పోలీసులే చిన్నారులకు పాఠాలను చేబుతూ.. మళ్లీ వారి ప్రాంతాల్లో వదిలిపేట్టేందుకు సైకిల్ రిక్షాను ఏర్పాటు చేశారు. అనాథలు, నిరాశ్రయులైన చిన్నారులకు మంచి విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన్నట్లు ట్రాఫిక్‌ డిసిపి వెల్లడించారు.

Ahmedabad traffic police imparts free education to children