Home జాతీయ వార్తలు శశికళను పార్టీలో చేర్చుకోవడంపై కోర్ కమిటీ నిర్ణయిస్తుంది

శశికళను పార్టీలో చేర్చుకోవడంపై కోర్ కమిటీ నిర్ణయిస్తుంది

Aiadmk core committee to discuss sasikala induction

 

ఎఐఎడిఎంకె నేత ఒ.పన్నీర్‌ సెల్వం

మదురై/చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు వికె శశికళను తిరిగి తమ పార్టీలో చేర్చుకోవడంపై కోర్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని ఎఐఎడిఎంకె అగ్రనేతల్లో ఒకరైన ఒ.పన్నీర్‌సెల్వం అన్నారు. శశికళ తిరిగి రాజకీయాల్లోకి రావడంపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఎవరైనా రావొచ్చునని.. అయితే, వారిని ప్రజలు ఆమోదిస్తారా..? లేదా..? అన్నది చూడాలని సెల్వం అన్నారు. కొన్నిరోజుల క్రితం ఇదే అంశంపై ఆ పార్టీ కోఆర్డినేటర్ కె.పళనిస్వామిని ప్రశ్నించగా, తిరిగి చేర్చుకునేందుకు అవకాశం లేదని చెప్పడం గమనార్హం. తమ పార్టీ నిర్మాణంతో కూడినదని, పార్టీకి కో ఆర్డినేటర్, కోకోఆర్డినేటర్ ఉన్నారని పన్నీర్‌సెల్వం గుర్తు చేశారు. కోకోఆర్డినేటర్‌గా పన్నీర్‌సెల్వం వ్యవహరిస్తున్నారు. మరోవైపు శశికళ మాత్రం ఎఐఎడిఎంకెకు తానే ప్రధాన కార్యదర్శినంటూ చెప్పుకుంటున్నారు. శశికళ నేతృత్వంలోని బృందంపై 2017లో ధర్మయుద్ధాన్ని పన్నీర్‌సెల్వం ప్రకటించారని ఎఐఎడిఎంకె మరో నేత డి.జయకుమార్ గుర్తు చేశారు. తమ మధ్య ఐక్యతకు శశికళతో తెగతెంపులు చేసుకోవాలంటూ మాజీముఖ్యమంత్రి పళనిస్వామికి ఆ సందర్భంగా పన్నీర్‌సెల్వం షరతు విధించారు.

AIADMK core committee to discuss sasikala induction