Thursday, April 25, 2024

ఫ్రీగా ఐపిఎల్ టికెట్లు: జై షాను అడుక్కోమన్న ఉదయనిధి స్టాలిన్

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళనాడులో ఎఐఎడిఎంకె అధికారంలో ఉన్నపుడు ఎమ్మెల్యేలకు ఉచితంగా ఐపిఎల్ టికెట్లు ఇచ్చామని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తమ ఎమ్మెల్యేలకు కూడా ఉచితంగా ఐపిఎల్ టికెట్లు ఇవ్వాలంటూ ఎఐఎడిఎంకె శాసనభ్యుడు ఎస్‌పి వేలుమణి మంగళవారం రాష్ట్ర శాసనసభలో డిఎంకె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఐపిఎల్ మ్యాచ్‌లకు సంబంధించి 400 టికెట్లు డిఎంకె ప్రభుత్వానికి వచ్చాయని, వాటిలో కనీసం ఒక్క టికెట్ కూడా ప్రతిపక్ష అన్నా డిఎంకె సభ్యులకు ఇవ్వలేదని వేలుమణి శాసనభలో విమర్శించారు.

Also Readనవంబర్‌లో ఎన్టీఆర్- హృతిక్ వార్ 2 షూటింగ్ ప్రారంభం

 

దీనిపై రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ దీటుగా స్పందించారు. మీ క్లోజ్ ఫ్రెండ్ అమిత్ షా కుమారుడు జై షా బిసిసిఐ కార్యదర్శి. మీరు ఆయనతో మాట్లాడడం మంచిది అంటూ ఉదయనిధి కౌంటర్ ఇచ్చారు. ఆయన(జై షా) మా మాట వినడు..మీరే ఆయనతో మాట్లాడి ఒక్కో ఎమ్మెల్యేకు కనీసం ఐదేసి టికెట్లు వచ్చేలా చూస్తే బాగుంటుంది. నా నియోజకవర్గంలో క్రీడాకారుల కోసం 150 టికెట్లు నేను డబ్బు పెట్టి కొన్నాను అంటూ మంత్రి ఉదయనిధి వెల్లడించారు.

ఇక్కడి ఎంఎ చిదంబరం స్టేడియంలో జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లకు మ్మెల్యేలకు టికెట్లు ఉచితంగా ఇచ్చామని అన్నాడిఎంకె సభ్యుడు చెప్పారని, అయితే గత నాలుగేళ్లలో ఒక్క మ్యాచ్ కూడా ఈ స్టేడియంలో జరగలేదని ఉదయనిధి అన్నారు. మరి ఎవరి కోసం ఆ పార్టీ టికెట్లు కొన్నదో నాకైతే అర్థం కావడం లేదు అంటూ మంత్రి కౌంటర్ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News