Home రాష్ట్ర వార్తలు విద్యాశాఖకు చికిత్స

విద్యాశాఖకు చికిత్స

cm-kcrవిద్యపై ఏటా 20 వేల కోట్లు ఖర్చుపెడుతున్నా కానరాని ఫలితం
అనవసర విభాగాల రద్దుకు సిఎం ఆదేశం
ఒకే విధమైన విధులు నిర్వహించే వాటిని కలపాలి,
సాంస్కృతిక శాఖకు ఆర్కైవ్స్, లైబ్రరీలు, అకాడెమీల
ఏకీకరణ, అన్ని విద్యాసంస్థలు విద్యాశాఖ పరిధిలోకి,
ఐటిఐలు సాంకేతిక విద్యాశాఖకు
హైదరాబాద్ : ‘విద్యాశాఖలో మొత్తం 14 విభాగాలు ఉన్నాయి. ఇంత భారీ సంఖ్యలో విభాగాలు మనకు అవసరం లేదు, వీలై నంత మేరకు తగ్గించేందుకు అవసరం లేని వాటిని రద్దు చేయాలి’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికా రులను ఆదేశించారు. ఒకే విధమైన విధులు నిర్వహించే విభాగాలను కలపాలని, రాష్ట్ర ప్రాచీన దస్తావేజుల (ఆర్కైవ్స్) విభాగం, గ్రంథాలయాలను సాంస్కృతిక శాఖ కు అప్పగించాలని, అన్ని భాషల అకాడెమీలను ఒకే అకాడెమీగా మార్పు చేయాలని ఆయన అన్నారు. అన్ని రకాల విద్యా సంస్థలను విద్యా శాఖ పరిధిలోకి తేవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఐటిఐని కార్మిక శాఖ నుంచి తీసేసి సాంకేతిక విద్యా శాఖకు బదిలీ చేయాలని, ఇలా ప్రతి శాఖలో ఉన్న విభాగాలపై లోతుగా అధ్యయనం చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వారస త్వంగా వచ్చిన ప్రతి పథకాన్ని, విధానాన్ని మనం కొన సాగించాల్సి అవసరం లేదని అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కొత్తగా ఆవిర్భవించిన మన రాష్ట్రానికి ఏది అవసరమో దానినే కొనసాగించాలి, అవసరం లేని, ప్రయోజనం లేని వాటిని రద్దు చేసుకోవడం ఉత్తమమన్నా రు. విద్యాశాఖలో ప్రచురణల (ప్రింటింగ్) విభాగం నిరర్థ కం, ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదని, వెంటనే తొలగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బడ్జె ట్ సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రి మంగళవారం క్యాం ప్ కార్యాలయంలో విద్యాశాఖపై సమీక్ష జరిపారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మ, విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సిం గ్ రావు, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బి.పి.ఆచార్య, ఆర్థిక శాఖ కార్యదర్శులు కె.రామకృష్ణారావు, ఎన్.శివ శంకర్, సమాచార పౌర సంబంధాల కమిషనర్ నవీన్ మిట్టల్, పాఠశాల విద్యా సంచాలకులు జి.కిషన్, ఎస్‌సి డెవలప్‌మెంట్ డైరెక్టర్ ఎం.వి.రెడ్డి, ప్రభుత్వ సలహాదారు లు జి.ఆర్.రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆర్థిక స్థోమత కలిగిన వారి పిల్లలు ప్రైవేటు స్కూళ్ళకు వెళ్ళి చదువుకుంటారని, ఎస్సి,ఎస్టి, బిసి, మైనారిటీ వర్గాల పిల్లలకు పుస్తకాలు, దుస్తులు, భోజనం సమకూర్చి గుణాత్మక విద్యను అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని అన్నారు. ప్రతి ఏడాది రూ.20 వేల కోట్లకు పైగా విద్యా రంగానికి కేటాయిస్తున్నామని, అయినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సి, ఎస్టి, బిసి సంక్షేమ శాఖల ద్వారా నడుస్తున్న సంక్షేమ హాస్టళ్ళను దశల వారీగా గురుకుల పాఠశాలలుగా మార్చాలని, ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అందచేయాలని ఆయన సంబంధిత శాఖలను ఆదేశించారు. పాఠశాల స్థాయి నుంచి విశ్వ విద్యాలయాల స్థాయి వరకు ప్రస్తుతం ఉన్న విద్యా సంస్థలు ఎ న్ని, ప్రస్తుతం ఎలా నడుస్తున్నాయి, ఏ విధమైన మార్పులు తీసుకురావాలనే దానిపై సమగ్ర అధ్యయనం చేయాలని అన్నారు. పాఠశాల విద్య, సాంకేతిక విద్య, ఉన్నత విద్య, విశ్వ విద్యాల యా లు, సొసైటీల ద్వారా నడుస్తున్న విద్యా సంస్థల సమా చారం ఒకే విభాగం ఆధీనంలో ఉండాలి. ఎన్ని విద్యా సంస్థలు ఉన్నాయి, వసతులు, విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల సంఖ్య, ఖాళీలు తదితర అంశాలపై పూర్తిగా అధ్య యనం చేయాలని అన్నారు. వివరాలు సేకరించేం దుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి అధికారిని నియమించాలన్నారు. లభ్యమైన వివరాలతో విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని, విద్యార్థులున్న విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. కొత్తగా భవనాలు నిర్మించే బదులు, అందుబాటులో ఉన్న భవనాల్లో బల్లలు, కుర్చీలు, విద్యుత్, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులను కోరారు. కేంద్ర పథకాలకు ఎంత సహాయం చేస్తున్నారు, మనం ఎంత మేర నిధులు సమకూర్చాలనేది పరిశీ లించి బడ్జెట్ ప్రతిపాదనలు అందచేలని వి శాఖను కోరారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగంలోనూ అనేక విద్యా సంస్థలు నడుస్తున్నాయి. ప్రభుత్వంలో ఎలా నడుపుతున్నారు, ప్రైవేటులో ఎలా నడుపుతున్నారనే విషయంలో విద్యాశాఖ అధ్యయనం చేసి, ఏ మార్పులు చేయాలో తెలుస్తుందని ఆయన వివరించారు. విద్యార్థులు లేకుండా పాఠశా లలను కొనసాగిస్తున్నారు, ఇలాం టి వాటిని ఏం చేయాలో ఆలోచించాలి. ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించి ఒక విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పాఠశాలల నిర్వహణ బాధ్యతను గ్రామ పంచాయతీలకు అప్పగిస్తూ త్వరలోనే చట్టం తీసుకువస్తామని అన్నారు.