Home జాతీయ వార్తలు ఎయిడ్స్ నివారణలో భారత్ కీలక పాత్ర

ఎయిడ్స్ నివారణలో భారత్ కీలక పాత్ర

AIDS treatment drugs

 

యునైటెడ్ నేషన్స్: హ్‌చ్‌ఐవి, ఎయిడ్స్ నివారణ ఔషధాల సరఫరాలో ప్రపంచంలో భారత్ చెప్పుకోదగిన పాత్ర వహిస్తోందని, రెండింట మూడింతలు మేరకు సరఫరా చేస్తున్నట్టు భారత్ దౌత్య ప్రతినిధి పౌలోమి త్రిపాఠి తెలిపారు. హెఐవి, ఎయివ్స్‌కు వ్యతిరేకంగా సాగిస్తున్న పోరాటంలో పురోగతి సాధిస్తున్నట్టు తెలిపారు. 2030 నాటికి ఎయిడ్స్ నిర్మూలన లక్షాన్ని సాధించ వలసి ఉందని చెప్పారు. ప్రపంచ ప్రజలను భయపెడుతున్న ఈ వ్యాధి నిర్మూలనలో భారత్ 80 శాతం కన్నా ఎక్కువ ప్రగతి సాధించినట్టు చెప్పారు. 1995లో అత్యధికంగా ఎయిడ్స్ మహమ్మారి బారిన పడి అత్యథిక శాతం మంది ప్రాణాలు కోల్పోగా 2005 నాటికి 71 శాతం మరణాలు తగ్గాయని వెల్లడించారు. ఇదే విధంగా 2017 నాటికి క్షయ రోగుల మరణాలు 84 శాతం తగ్గాయని అన్నారు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోడానికి వ్యాధిని కచ్చితంగా గుర్తించ గలిగేలా పక్కా పరిశోధనలు చేపట్టడానికి వ్యాధి నిర్మూలన వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి దృష్టి కేంద్రీకరించడానికి ఇది తగిన సమయంగా పేర్కొన్నారు.

భారత దేశంలో హెఐవి నిర్మూలన, నియంత్రణ చట్టం గత ఏడాది సెప్టెంబరు నుంచి అమలు లోకి వచ్చిందని, దీనివల్ల ఎయిడ్స్ రోగుల పట్ల నిర్లక్షం, ఉదాసీనత ఎవరైనా అవలంబించడానికి వీలుండదని అన్నారు. ఎయిడ్స్ రోగులు సమాజంలో గౌరవవంతమైన జీవితం గడపడానికి ఇది హక్కులను కల్పిస్తుందని తెలిపారు. ఉద్యోగాల్లో, ఆరోగ్య భద్రత సర్వీసుల్లో, విద్యారంగంలో ప్రజాసేవల్లో, ఆస్తి హక్కుల్లో, ఎక్కడైనా వివక్షత చూపించితే వారిపై ఎయిడ్స్ రోగుల ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. నేషనల్ ఎయిడ్స్ కంట్రోలు ఆర్గనైజేషన్ వివరాల ప్రకారం 2017 లో భారత్‌లో ప్రపంచం మొత్తం మీద మూడో స్థాయిలో 2.1 మిలియన్ హెచ్‌ఐవి, ఎయిడ్స్ రోగులు ఉండగా, 750000 మంది ప్రభుత్వ వైద్య కేంద్రాల నుంచి ఉచితంగా పరఫరా అయ్యే మందులపై ఆధారపడే వారు. 2017లో 80 వేల కొత్త రోగుల్లో 69 వేల మంది ఎయివ్స్ వల్లనే మరణించారు. 2000 నుంచి 2011 వరకు హెచ్‌ఐవిని నియంత్రించడంలో భారత్ చెప్పుకోదగిన పురోగతి సాధించింది. 2000 నుంచి 2012 వరకు హెచ్‌ఐవి కేసులు సగానికి సగం తగ్గాయి.

AIDS treatment drugs supplied globally by India