Home రంగారెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం

గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం

అభివృద్ధి చేస్తున్నం కాబట్టే ఓట్లడుగుతున్నం
పంచాయతీ రాజ్ రోడ్లకు రూ.600 కోట్లు మంజూరు
నవాబ్‌పేట్‌లో రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి
MENDARనవాబుపేట్ : అభివృద్ధి చేస్తున్నాం కాబట్టే తమ అభ్యర్తిని గెలిపించాలని ధైర్యంగా అడుతున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. నవాబుపేట్‌లో సోమవారం జడ్పీటిసి ఉప ఎన్నికల నేపథ్యంలో బహిరంగ సభ, అనంతరం ప్రచారం నిర్వహించారు. ఈ బహిరంగసభ, ప్రచారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ గెలుపే లక్షంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడీ ఏర్పడగానే బంగారు తెలంగాణకు బాటలు వేసేలా అన్ని లింకు రోడ్లను పునరుద్ధరించామన్నారు. జిల్లాలో పంచాయతీరాజ్ రూ.600, ఆర్‌అండ్‌బి రోడ్లకు రూ.1,400 కోట్లు మంజూరు చేసిన ఘనత టిర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ఒక్క నవాబుపేట్ మండలానికే రూ. 100 కోట్లు వెచ్చించి అభివృద్ది చేశామన్నారు. అంతేకాకుండా ఏ ప్రభుత్వం చేపట్టిన విధంగా మిషన్‌కాకతీయ పేరుతో చెరువులు, కుంటలను పూడిక తీసి నీరు ఎక్కువగా నిలిచేలా పునరుద్దరించామన్నారు. రెండో విడత మిషన్ కాకతీయ కింద కూడా కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ది చేస్తుందన్నారు. అర్హులందరికీ 200 పింఛన్‌ను వెయ్యి రూపాయలు చేసిందన్నారు. విద్యార్థులకు పాఠశాలల్లో సన్న బియ్యంతో పాటు మంచి విద్యను అందిస్తూ విద్యాభివృద్దికి పెద్ద పీట వేస్తున్నామన్నారు. ముఖ్యంగా ఇళ్లు లేని నిరుపేదలను ఎంపిక చేసిన నియోజకవర్గానికి 400 డబుల్ బెడ్‌రూంలు ఇస్తున్నామని తెలియజేశారు. ఒక్కో ఇంటిని రూ.5 లక్షలకు పైగా వెచ్చించి ధన వంతుల ఇళ్లు మాదిరిగా నిర్మించి ఇంటి తాళం చెవి అందజేస్తామన్నారు.కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను మన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్నారన్నారు. ప్రతి మండలానికి దీపం సిలిండర్లను అందజేశామన్నారు. అనతి కాలంలో ఇలాంటి అభివృద్దికి పాటుపడుతున్నామన్నారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ది శూన్యమని ఓటు అడిగే హక్కు కూడా వారికి లేదన్నారు. అందుకే మనపార్టీ తరపున నవాబుపేట్ జెడ్పీటీసీగా బరిలోకి దింపున పోలీస్‌రాంరెడ్డిని భారీ మెజారీటీతో గెలిపించాలన్నారు. ఈ గెలుపు అభివృద్ది చేస్తున్న మన ముఖ్యమంత్రిగారికి కానుకగా ఇవ్వాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే కాలెయాదయ్య మాట్లాడుతూ చేవెళ్ల నియోజకవర్గంలో నవాబుపేట్‌లో కొత్త చరిత్ర సృష్టించేలా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు నాగేందర్‌గౌడ్ మాట్లాడుతూ కొన్నేళ్లుగా ఏప్రభుత్వం చేయలేనంత అభివృద్ది మన ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపించారన్నారు. బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్న మన పార్టీ మరింత బలోపేతం కావాలంటే నవాబుపేట్ జెడ్పీటీసీగా పోలీస్‌రాంరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సమావేశానికి ముందు కళాకారుల నృత్యంతో ఆకట్టుకున్నారు. సమావేశం అనతరం నవాబుపేట్‌లో మంత్రి మహేందర్‌రెడ్డి జెడ్పీటీసీ అభ్యర్థి పోలీస్‌రాంరెడ్డితో కలిసి మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. ఈ సమావేశం, ప్రచార కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు స్వప్న, మాజీ మహిళా అధ్యక్షురాలు జ్యోతి, ఎంపీపీ పాండురంగారెడ్డి, కళాకారుడు సాయిచరణ్, నాయకులు సత్యనారాయణరెడ్డి, విజయేందర్‌రెడ్డి, రఘుపతిరెడ్డి, ఆర్కతల సర్పంచ్ రాములు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు డెక్క మానయ్య, రత్నం, మోమన్‌రెడ్డి, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.
ముఖం చాటేసిన సొంత పార్టీ వైరి వర్గం …
నవాబుపేట్ బహిరంగ సమావేశానికి రాష్ట్ర మంత్రి మహేంర్‌రెడ్డే వచ్చినా నవాబుపేట్ మాజీ జెడ్పీటీసీ యాదవరెడ్డి, ఆయన వర్గం ముకం చాటేశారని, అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యే రత్నం వచ్చినా ఆయన వర్గం రాలేదని, మండట పార్టీకే పట్టుకొమ్మ అయిన మదుసూదన్‌రెడ్డి రాకపోవడంపై ఓటర్ల సొంత పార్టీలో కుంపటి పోరు కనబడుతుందని అనుకున్నారు. నవాబుపేట్ మాజీ జెడ్పీటీసీ, ప్రస్తుత ఎమ్మెల్సీ యాదవరెడ్డి తమ బంధువులు మృతి చెందడం వల్లే రాలేక పోయారని బహరింగంగా చెప్పినా.. రావడానికి ఆయన ముఖం లేదని ఓటర్లు అనుకున్నారు.
మిషన్ కాకతీయలో గ్రామాలు సస్యశామలం …
శంకర్‌పల్లి: మిషన్ కాకతీయలో ప్రతి గ్రామంలోనీ చెరువులను మొదటి దశగా పనులను చేపట్టామని రెండవ దశగా పనులను ప్రారంభించనున్నామని రాష్ట్ర రవాణశాఖ మంత్రి పి.మహేంధర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన శంకర్‌పల్లిలో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చెరువుల పూడికతీత తీయడంతో ఎన్నో చెరువులు నిండ్డాయని కొన్ని జిల్లాలో వర్షాపాతం తక్కువ ఉన్నందున నిండలేకపోయాయని దీంతో రెండవ దశ పనులు కూడా ప్రారంభించనున్నట్లు తెలంగాణ రాష్ట్రాన్ని శశ్యశామలం చేయడమే ముఖ్యమంత్రి కెసీఆర్ లక్షమని అన్నారు. రాబోవు రెండు సంవత్సరాలలో వాటర్ గ్రీడ్ ద్వారా ప్రతి ఇంటికి నళ్ళాలు ఏర్పాటు చేస్తామని పటిష్ఠమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని అలాగే డబుల్‌బెడ్‌రూంలు మొదటి విడతగా ప్రతి నియోజకవర్గానికి 400 కేటాయించామని ఇందులో ఎమ్యేల్యే సిఫారసు మేరకు ఎంఆర్‌ఓ ఇళ్ళు లేనివారికి, అసలైన పూరి గుడిసె ఉన్న నిరుపేదకే డబుల్‌బెడ్‌రూంలను మంజూరు చేస్తామని ఇందులో ఎలాంటి ఆవకతవకలకు తావు ఉండదని హామి ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసీఆర్ బంగారు తెలంగాణ చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని వారు ప్రవేశపెట్టిన హరితహారం, గ్రామజ్యోతి, కళ్యాణలక్ష్మి, షాదిముభారక్ పథకాలే నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ళ ఎమ్యేల్యే కాలెయాదయ్య, మాజి ఎమ్యేల్యే కెఎస్ రత్నం మాజి ఎమ్యేల్సీ నరేంధర్‌రెడ్డి, జిల్లా టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు నాగేంధర్‌గౌడ్ , మండల టిఆర్‌ఎస్‌పార్టీ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, జిల్లా సర్పంచుల సంఘం వర్కింగ్ ప్రసిడెంట్ బి.శ్రీధర్, ఉపసర్పంచ్ దండు సంతోష్, టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు శేఖర్‌గౌడ్, మాజి ఎంపీపీ సత్యనారాయణ, టిఆర్‌ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వాసుదేవ్‌ఖన్న, నాయకులు శేరి అనంత్‌రెడ్డి, బొమ్మన్నగారి క్రిష్ణ, ఒగ్గు మల్లేష్, మంగలి శివకుమార్, విజయ్‌కుమార్, నర్సింలు తదితరులు పాల్గోన్నారు