Home Default ‘ఫణి’ బాధితులకు అండగా ఎయిర్ ఇండియా

‘ఫణి’ బాధితులకు అండగా ఎయిర్ ఇండియా

air-indiaన్యూఢిల్లీ : ఒడిశాలోని ఫణి తుపాన్ బాధితులకు సహాయం చేయడానికి ఎయిర్ ఇండియా ముందుకొచ్చింది. ఫణి విపత్తు వల్ల అతలాకుతలమైన బాధితులను ఆదుకోవడానికి వీలుగా ఢిల్లీ నుంచి వస్తు సామాగ్రిని తన విమానంలో ఉచితంగా తీసుకువచ్చేందుకు ఎయిర్ ఇండియా నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని అయిన ఢిల్లీలో స్వచ్ఛంద సంస్థలు, పౌరసంఘాలు, ఒడిశా రెసిడెంట్ కమిషనర్లు సేకరించిన సహాయ పునరావాస సామాగ్రి, బట్టలు, వంటపాత్రలను విమానంలో భువనేశ్వర్ కు తరలిస్తామని ఎయిర్ ఇండియా పేర్కొంది.
Air India announces free of cost shipping for fani victims