Home టెక్ ట్రెండ్స్ ఎయిర్‌టెల్ 30జిబి ఆఫర్

ఎయిర్‌టెల్ 30జిబి ఆఫర్

వినియోగదారులకు మాత్రమే

airtel free roaming offer all over india from april 1st 2017

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో జోరులో ప్రత్యర్థి టెలి కామ్ సంస్థలు మార్కెట్‌ను కోల్పోకుండా ఉండేం దుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. దీనిలో భాగంగా తాజాగా ఎయిర్‌టెల్ ఆఫర్‌ను ప్రకటించింది. వచ్చే మూడు నెలల పాటు పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు ఉచి త డాటాను అందించనున్నట్లు తెలిపింది. ఎయిర్ టెల్ తన వినియోగదారులకు ఇప్పటికే పలు ఆఫ ర్లను ప్రకటించింది. అయినప్పటికీ పోస్ట్ పెయిడ్ వినియోగదారులు దూరం కాకుండా ఉండేందుకు భారీ ఆఫర్‌ను ప్రకటించింది. ‘మై ఎయిర్‌టెల్’ యాప్‌ను లాగిన్ కావడం ద్వారా నెలకు 10జిబి చొప్పున మూడు నెలల పాటు 30జిబి డాటాను పొందవచ్చు. వచ్చే మూడు నెలలు ఉచిత డేటాను ఆనందించాలని, ఏదైనా దూర ప్రయాణానికి వెళ్లా లని ప్రణాళిక వేసుకుంటే అందుకు ఇది ఉపయో గపడుతుందని భారతీ ఎయిర్‌టెల్ సిఇఒ గోపాల్ విఠల్ వెల్లడించారు.

మూడు రోజుల క్రితం ఎయి ర్‌టెల్ రూ.244, రూ.345, రూ.399 రీచార్జి ఆఫర్లను ప్రకటించింది. 4జి వినియోగదారులు రూ.399తో రీచార్జి చేసుకుంటే 70 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1 జిబి 4జి డాటా పొందవ చ్చు.  అన్ని నెట్‌వర్క్‌లకు 3వేల ఉచిత నిమిషాలు పొందవచ్చు. ఎయిర్‌టెల్ ప్రకటించిన రూ.244తో రీఛార్జి చేసుకుంటే 70రోజులపాటు రోజుకు 1జిబి డేటాతోపాటు ఎయిర్‌టెల్ నుంచి ఎయిర్‌టెల్‌కి రోజుకి 300 ఉచిత నిమిషాలు, వారానికి 1200 ఉచిత నిమిషాలు పొందవచ్చు.  ఐడియా నుంచి రూ.297, రూ.447, వొడాఫోన్ నుంచి రూ.352, బిఎస్‌ఎన్‌ఎల్ నుంచి రూ.249 రీఛార్జిలతో డాటా ఆఫర్లను ప్రకటించాయి. ఐడియా ప్రకటించిన రూ.297తో రీఛార్జి చేస్తే 70రోజులపాటు రోజుకి 1జిబి డాటా, సొంత నెట్‌వర్క్‌కి రోజుకి 300, వారానికి 1200 ఉచిత నిమిషాలు లభిస్తాయి. వొడాఫోన్ ప్రవేశపెట్టిన రూ.352తో రీఛార్జి చేసు కుంటే 56 రోజులపాటు రోజుకి 1జిబి డేటాతో పాటు అన్ని నెట్‌వర్క్‌లకు ఉచితకాల్స్ మాట్లాడుకోవచ్చు.