Saturday, April 20, 2024

భద్రాద్రి, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో విమానాశ్రయాలు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: తెలంగాణలో కొత్త డ్రోన్ పాలసీని తీసుకొచ్చామని మంత్రి కెటిఆర్ తెలిపారు. బేగంపేట్ విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా -2020ని మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. ఏరోస్సేస్ సెక్టార్‌లో తెలంగాణ దూసుకపోతుందని కొనియాడారు. కరోనా వైరస్ భయంతో వింగ్స్ ఇండియా నిర్వహణ జరుగుతుందా? అనే అపనమ్మకం ఏర్పడిందని, కానీ తగు జాగ్రత్తలు, దృఢ నిశ్చయంతో ప్రదర్శనను సుసాధ్యం చేశారని ప్రశంసించారు. దేశంలో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. తెలంగాణలో మూడు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరామని, భద్రాద్రి, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లోని గుదిబండలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. వరంగల్ విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏవియేషన్ అధికారులు పాల్గొన్నారు.

Airports in Bhadradri, Nizamabad, Mahaboobnagar
airports in Bhadradri, Nizamabad, Mahaboobnagar
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News