Home తాజా వార్తలు క్యూ2లో ఎయిర్‌టెల్ నష్టం రూ.23,045 కోట్లు

క్యూ2లో ఎయిర్‌టెల్ నష్టం రూ.23,045 కోట్లు

Airtel

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(201920) సెప్టెంబర్ ముగింపునాటి రెండో త్రైమాసిక ఫలితాల్లో టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ తీవ్ర నిరాశపర్చింది. సంస్థకు దాదాపు రూ.23,044 కోట్ల నష్టం వచ్చింది. అంచనాలకు మించి భారీగా నష్టాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.119 కోట్లు ఉంది. భారతీ ఎయిర్‌టెల్ ఆర్పు(యావరేజ్ రెవెన్యూ ఫర్ యూజర్) ఈసారి రూ.128 నమోదవగా, ఇంతకుముందు ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో ఆర్పు రూ.129 ఉంది. గురువారం కంపెనీ ఈ ఫలితాలను ప్రకటించింది.

సంస్థ ఆదాయం గతేడాదితో పోలిస్తే 5 శాతం పెరిగి రూ.21,131 కోట్లు నమోదైంది. రెండో త్రైమాసికంలో సంస్థకు 80 లక్షల మంది 4జి కస్టమర్లు చేరారు. భారతీ ఎయిర్‌టెల్ సిఇఒ, ఎండి గోపాల్ విటల్ మాట్లాడుతూ, సీజనల్‌గా బలహీన త్రైమాసికం అయినప్పటికీ రెవెన్యూ వృద్ధి సానుకూలంగా ఉందని అన్నారు. ఎబిటా 41 శాతం పెరిగి రూ.8,936 కోట్లు నమోదు చేసింది. టెలికాం శాఖ(డాట్) బకాయిలను చెల్లించాలని ఆపరేటర్లకు సుప్రీం కోర్టు మూడు నెలల గడువు ఇచ్చింది. కోర్టు తీర్పు తమ సంస్థ మరింత సంక్లిష్టంగా మారనుందని కంపెనీ పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో మార్కెట్లో ఎయిర్‌టెల్ షేరు విలువ 1 శాతం పతనమై రూ.362 వద్ద స్థిరపడింది.

Airtel posts Rs 23 045 crore Q2 loss