Home ఆదిలాబాద్ ఎరుపెక్కిన మంచిర్యాల

ఎరుపెక్కిన మంచిర్యాల

 ఎఐటియుసి తొలి తెలంగాణ మహాసభలకు సన్నద్ధం
 మూడు రోజుల కార్యక్రమానికి ఏర్పాట్లలో కామ్రేడ్లు నిమగ్నం

adilabad2మంచిర్యాల : కార్మికుల సమస్యల పరిష్కారమే లక్షంగా.. హక్కుల సాధనే మార్గంగా నిర్వహించే ఎఐటి యుసి తెలం గాణ తొలి మహాసభలకు మంచి ర్యాల సిద్దమైంది. శ్రీరాంపూర్‌లోని నర్సయ్య భవన్ కేంద్రంగా మహా సభ, ప్రతినిధుల సభ, బహిరంగ సభల ఏర్పాట్లలో కార్మికులు నిమగ్నం కాగా, వాడవాడల అరుణ పథకాలతో మంచి ర్యాల ఎరుపెక్కింది.
చురుగ్గా సాగుతున్న ఏర్పాట్లు
మూడురోజుల కార్మిక కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సిపిఐ అనుబంధ సంఘమైన ఎఐటియుసి ఈ మహా సభలకు వినూత్నరీతిలో సిద్దమవుతోంది. వాడ వాడల పెద్ద పెద్ద హోర్డింగులు, అరుణ పతా కాలతో వాడవాడల కార్యక్రమ హడావుడి కనిపిస్తుంది. గోదావరిఖని నుంచి చెన్నూర్ పరిసర ప్రాంతాలు, ఇటు వైపు బెల్లంపల్లి, ఆసిఫాబాద్ మార్గాల నుంచి మంచిర్యాల వైపు వచ్చే కార్మికుల కోసం దారి పొడువునా పెద్దపెద్ద హోర్డింగులు ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లను సిపిఐ జిల్లా కార్య దర్శి కలవేణ శంకర్, సిపిఐ కార్యదర్శి వర్గ సభ్యు లు గుండామల్లేష్, ఎఐటియుసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వాసిరెడ్డి సితారామయ్య, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి ఎస్ విలాస్, మంచిర్యాల నియోజకవర్గ ఇంచార్జ్ కలవేణ కుమార స్వామి ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తున్నారు.
తరలిరానున్న అగ్ర నాయకత్వం
మూడు రోజుల కార్మికుల మహాసభకు సిపిఐ, ఎఐటియుసి, ఎఐఎస్‌ఎఫ్, ఎఐవైఎఫ్, రైతు సంఘాల రాష్ట్ర అగ్ర నాయకత్వం అంత సభలకు విచ్చేయనున్నారు.
ఈ సందర్భంగా అగ్ర నాయకత్వం కార్మి కుల హక్కుల సాధన కోసం చేపట్టబోయే భవిష్యత్ కార్యాచరణ కోసం దిశా నిర్ధేశం చేయనున్నారు. మొత్తానికి కార్మిక సంఘం ఆద్వర్యంలో చేపట్టబోయే తెలంగాణ తొలిసభలకు కామ్రెడ్లతోపాటు కార్మికులు కర్షకులు సన్నద్ధం అవుతున్నారు.