Friday, March 29, 2024

ఢిల్లీ మృతులు 27

- Advertisement -
- Advertisement -

Ajit Doval

 

అల్లర్ల ప్రాంతంలో అజిత్ దోవల్ పర్యటన
సోదరభావంతో మెలగాలని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్
కోలుకుంటున్న ఈశాన్య ఢిల్లీ
ఇతర చోట్ల దహనకాండ బాధితులను ఆదుకోండి
రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన వారిపై కేసులు పెట్టండి : ఢిల్లీ హైకోర్టు
సైన్యాన్ని పిలిపించాలని కేజ్రీవాల్ సూచన
అమిత్‌షా రాజీనామా చేయాలి : సోనియా

న్యూఢిల్లీ: రెండు రోజుల మత ఘర్షణల తర్వాత ఢిల్లీ కాస్త ప్రశాంతంగా కనిపించింది. అల్లర్లు జరిగిన ఈ శాన్య ఢిల్లీలో కొంతమేరకు నిశ్శబ్దం అలముకొంది. కొన్ని ఇతర ప్రాంతాల్లో షాపులకు దుండగులు నిప్పంటించారు. ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) స్టాఫర్ మృతదేహం డ్రెయిన్‌లో కనిపించింది. ఘర్షణల్లో చనిపోయిన వారి సంఖ్య 27 కు పెరిగింది. సోమవారం నుం చి రగిలిన హింసాత్మక పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహించారు. అన్ని ప్రాంతాల్లో భద్రతా సిబ్బంది కాప లా కాస్తున్నారు. ఇలా ఉండగా, ఢిల్లీ ఘర్షణలపై ప్రధాని నరేంద్రమోడీ బుధవారం మొదటిసారి స్పందించారు. శాంతిని, సోదరభావాన్ని పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈశాన్య ఢిల్లీలో శాంతి పునరుద్ధరణ చాలా ముఖ్యమని ప్రధాని ట్వీట్ చేశారు. ‘ఢిల్లీలో వివిధ ప్రాం తాల్లో పరిస్థితిపై విస్తృతంగా సమీక్షించాం. సాధారణ పరిస్థితుల్ని నెలకొల్పేందుకు పోలీసులు ఇతర వ్యవస్థలు శ్రమిస్తున్నాయి’ అని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

రకరకాలుగా గాయపడిన బాధితులు
ఢిల్లీ ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య 22కు పెరిగిందని, 200 మందికి పైగా గాయపడ్డారని జిటిబి ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ సునీల్‌కుమార్ తెలిపారు. బాధితుల్ని గుర్తించారా అని అడగ్గా…‘చాలామందిని గుర్తించాం. కొందరిని గుర్తించాల్సి ఉంది’ అని జిటిబి ఆస్పత్రి అధికారి చెప్పారు. బాధితులకు అనేక రకాల గాయాలయ్యాయి. కొందరికి బుల్లెట్లు తగలగా, మరికొందరు రాళ్ల దాడిలో గాయపడ్డారు. దుండగుల నుంచి తప్పించుకునేందుకు ఇళ్ల పై కప్పుల్నించి దూకుతూ ఇంకొందరు గాయపడ్డారని ఆస్పత్రి అధికారులు చెప్పారు.ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే … మృతులు, గాయపడిన వారి గురించి పోలీసులు కాక, ఆస్పత్రి అధికారులు తెలియజేయడం.

పరిస్థితి ఆందోళనకరం : కేజ్రీవాల్
ఈశాన్య ఢిల్లీలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, పరిస్థితిని అదుపు చేయడం పోలీలసులకు సాధ్యం కావడం లేదుకాబట్టి సైన్యాన్ని పిలిపించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. ఇలా ఉండగా, చాంద్‌బాగ్‌లో ఒక డ్రెయిన్‌లో ఇంటెలిజెన్స్ బ్యూరో సిబ్బంది మృతదేహం కనిపించింది. ఆయన అంకిత్ శర్మగా గుర్తించారు. రాళ్లదాడిలో ఆయన మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఎవరూ ఇళ్లలోంచి బయటకు రావద్దని పోలీసులు హెచ్చరిస్తూ ప్రకటిస్తుండడంతో వీధులు నిర్మానుష్యంగా కనిపించాయి. షాపులు, స్కూళ్లను మూసేశారు. చాంద్‌బాగ్‌లో భద్రతా దళాలు నిరంతరం పహరా కాస్తున్నాయి. రెండు రోజులుగా జరిగిన హింసాకాండలో అనేక వాహనాలు దగ్ధం కావడంతో గోకుల్‌పురీలో గాలిలో దట్టంగా పొగ అలముకొంది. వీధుల్లో ఇటుకలు, రాళ్లు, పగిలిన గాజు ముక్కలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.

కానిస్టేబుల్ కుటుంబానికి రూ.2కోట్ల పరిహారం
ఢిల్లీలో చెలరేగిన అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వంతో ఢిల్లీ ప్రభుత్వం ఆర్థికసాయం ప్రకటింయాయి. కోటి రూపాయలతోపాటు అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్టు కేంద్రం ప్రకటించింది. అల్లర్లలో మృతి చెందిన రతన్ లాల్‌ను అమరవీరుడిగా ప్రకటించింది. ఈశాన్య ఢిల్లీలోని గోకుల్‌పురిలో సోమవారం పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారి తీయగా అక్కడే విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ ఈ దాడిలో ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. బుల్లెట్ గాయం వల్లే ఆయన చనిపోయాడని పోస్ట్‌మార్టమ్ నివేదికలో తేలింది. మరోవైపు ఆప్ ప్రభుత్వం కూడా రతన్‌లాల్ కుటుంబానికి రూ.కోటి పరిహారం ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు.

Ajit Doval tour of the riot area
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News