Home తాజా వార్తలు ‘ఆకాశవాణి’ సినిమా ఫ‌స్ట్ లుక్‌… మోష‌న్ పోస్ట‌ర్‌ విడుదల

‘ఆకాశవాణి’ సినిమా ఫ‌స్ట్ లుక్‌… మోష‌న్ పోస్ట‌ర్‌ విడుదల

Akashavaani Motion Poster Release By Hero Ranaహైదరాబాద్ : ’ఆకాశవాణి‘ పేరుతో టాలీవుడ్ లో ఓ సినిమా రూపొందుతోంది. ఎయు అండ్ ఐ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ప‌ద్మ‌నాభ‌రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన అశ్విన్ గంగ‌రాజు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి కొడుకు, సింగ‌ర్ కాల‌భైర‌వ సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్ర‌హీత శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్న ఈ సినిమాకు  ప్రముఖ ర‌చ‌యిత సాయిమాధ‌వ్ బుర్రా మాటలు, సురేశ్ ర‌గుతు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఈ క్రమంలో  ‘ఆకాశవాణి’ సినిమా ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను ప్రముఖ హీరో రానా ద‌గ్గుబాటి త‌న ట్విట్ట‌ర్ ద్వారా ఆదివారం ఆవిష్కరించారు. ఓ పల్లెటూరు కథతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు తెలిసింది.