Tuesday, April 16, 2024

తమిళనాడులో క్లైమాక్స్

- Advertisement -
- Advertisement -

Akhanda Climax shooting in Tamil Nadu

 

సింహా, లెజెండ్ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల తర్వాత హీరో నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తాజాగా రూపొందుతున్న మూడో చిత్రం ‘అఖండ’. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమా తాజా షెడ్యూల్ తమిళనాడులో ప్రారంభమైంది. తమిళనాడులోని ఓ దేవాలయంలో ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ సీన్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ షూట్‌లో బాలకృష్ణతో పాటు ఈ సినిమాలోని ఇతర ప్రధాన తారాగణం అంతా పాల్గొంటున్నారు. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ స్టంట్ శివ డిజైన్ చేసిన ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో మరో హైలైట్‌గా నిలవనుంది. ఈ సినిమాను ద్వారక క్రియేషన్స్ పతాకంపై నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా జగపతిబాబు, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News