Tuesday, April 23, 2024

25 డేస్ సెలెబ్రేషన్స్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్‌ను ‘అఖండ’ సినిమా మరోసారి నిరూపించింది. ఈ సినిమా విడుదలై 25 రోజులైనప్పటికీ మంచి కలెక్షన్స్ సాధిస్తుండడం విశేషం. నాలుగో వారంలో కూడా ‘అఖండ’ భారీ కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా భారీ సక్సెస్ సాధించడంతో చిత్రయూనిట్ విజయోత్సవాలు నిర్వహించింది. సక్సెస్ సెలెబ్రేషన్స్‌లో నందమూరి బాలకృష్ణ, దిల్‌రాజు, బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి సహా చిత్రయూనిట్ పాల్గొంది. ఈ వేడుకలో అందరికీ సక్సెస్ షీల్డ్ అందించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అఖండ చిత్రాన్ని విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్లు ఈ సక్సెస్ సెలెబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. ఈ సినిమాతో బాలకృష్ణ, బోయపాటి హ్యాట్రిక్ హిట్స్‌ను సాధించారు.

Akhanda movie 25th day Celebrations

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News