Wednesday, November 30, 2022

చరిత్ర సృష్టించాలన్నా మేమే.. తిరిగి రాయాలన్నా మేమే

- Advertisement -

Akhanda movie success press meet

 

నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’. తాజాగా విడుదలైన ఈ చిత్రం అన్ని కేంద్రాల్లో బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సినిమాను నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను, తమన్, మిర్యాల రవిందర్ రెడ్డి హైదరాబాద్‌లోని ఏఎంబి మాల్‌లో ప్రత్యేకంగా వీక్షించడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. “ఆనాడు రామాయణాన్ని రాసిన వాడు వాల్మీకి. ఈనాడు అఖండ సినిమాను ఇంత బాగా తీర్చిదిద్దినవాడు బోయపాటి శ్రీను. ఈ సినిమాను ఇంత విజయాన్ని చేకూర్చినందుకు తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. మంచి సినిమా ఎప్పుడూ వచ్చినా కూడా ఆదరిస్తారు అని చెప్పడానికి ఈ చిత్రమే నిదర్శనం. ఇది కేవలం మా విజయమే కాదు చలనచిత్ర పరిశ్రమ విజయం. ‘అఖండ’ ఓ పౌరాణిక చిత్రం. భగవంతుడిని కరుణించమని అడుగు.. కనిపించమని కాదు అని ఎన్నో డైలాగ్స్ ఉన్నాయి.

ఈ ‘అఖండ’కు అఖండమైన విజయం చేకూర్చారు. చరిత్ర సృష్టించాలన్నా మేమే.. తిరిగి రాయాలన్నా మేమే. ఆనాడు ఎన్.టి.రామారావు సినిమా మాధ్యమం ద్వారా భక్తిని కాపాడారు. మున్ముందు తరాలకు కూడా భక్తి అంటే ఏంటో చూపిస్తాం. భక్తి అంటే ధృడ సంకల్పం. చేసే పనిలోనే దైవం ఉంటుంది. సినిమాయే మాకు దైవం. నేను డైరెక్టర్ ఆర్టిస్ట్‌ని. డైరెక్టర్ ఎలా చెబితే అలా చేస్తాను”అని అన్నారు. చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ “ఈ సినిమా విడుదలైన తర్వాత అందరి నోటి నుంచి ఒక మాట వచ్చింది. సూపర్ హిట్ అని అంటున్నారు. రెండు కరోనాలను ఎదుర్కొని విడుదలైన ఈ సినిమా.. నందమూరి అభిమానులు, ప్రేక్షకులందరికీ సంతోషాన్ని ఇచ్చింది. థియేటర్ల ముందు ఇంత సందడి వాతావరణం ఇరవై ఏళ్ల క్రితం చూశాం. మళ్లీ ఇప్పుడు కనిపించింది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి, సంగీత దర్శకుడు తమన్ పాల్గొన్నారు.

Akhanda team success press meet on dwaraka creations

Related Articles

- Advertisement -

Latest Articles