Friday, March 29, 2024

‘అఖండ’ టైటిల్ సాంగ్ ప్రోమో..

- Advertisement -
- Advertisement -

నంద‌మూరి బాల‌కృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ’. ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విష‌యం తెలిసిందే. దీపావళి సందర్భంగా ఈ మూవీ టైటిల్ సాంగ్ ప్రోమోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. పూర్తి లిరికల్ వీడియో సాంగ్ నవంబర్ 8న విడుదల కానుంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తుంది. హీరో శ్రీకాంత్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. కాగా, ఈ మూవీ విడుదల తేదీని చిత్రయూనిట్ ఇంకా వెల్లడించలేదు.

AKHANDA Title Song Promo Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News