Home తాజా వార్తలు రొమాన్స్ హైలైట్‌గా…

రొమాన్స్ హైలైట్‌గా…

Akhil act in most eligible bachelor

 

అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి నాలుగు రోజుల ప్యాచ్ వర్క్ ఉందట. అన్నీ కుదిరితే ఈ నెల 7 నుండి అఖిల్‌పై సోలో షాట్స్ తీయనున్నారు. ఇక కరోనా సెకెండ్ వేవ్ తగ్గిన తరువాత ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో లవ్ ట్రాక్ చాలా బాగా వచ్చిందని.. ముఖ్యంగా లవ్ సీన్స్‌లో అఖిల్, – పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుందట. వీరి మధ్య రొమాన్స్ సినిమాకే ఓ హైలెట్‌గా నిలుస్తుందని తెలిసింది. కాగా అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాను బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై అఖిల్‌తో పాటు బొమ్మరిల్లు భాస్కర్ కూడా బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. మరి అఖిల్‌కి ఈ సినిమా ఏ రేంజ్‌లో హిట్‌నిస్తుందో చూడాలి.