Home జాతీయ వార్తలు నా భద్రతను బిజెపి వెనక్కు తీసుకోవచ్చు

నా భద్రతను బిజెపి వెనక్కు తీసుకోవచ్చు

Akhilesh Yadav

 

అఖిలేష్ యాదవ్ సవాల్

లక్నో : ఎన్‌ఎస్‌జి భద్రత తొలగించిన నేపథ్యంలో సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తనకు ఎలాంటి భద్రత అవసరం లేదని, ధైర్యం ఉంటే ఇప్పుడున్న కనీస భద్రత కూడా బిజెపి తీసివేయవచ్చని సవాలు విసిరారు. అధికార పార్టీ నాయకుని నుంచి తనకు బెదిరింపులు వచ్చాయని, తాను నిర్వహించిన సమావేశంలో ఒక యువకుడు రసాభాస చేసి మతపరంగా జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశాడని ఆయన పేర్కొన్నారు. ఎందుకు తనకు ఎన్‌ఎస్‌జి తొలగించారు ? తన ఇంటిని, వాహనాన్ని కూడా బిజెపి ప్రభుత్వం తీసుకోవచ్చని, సెక్యూరిటీని కూడా స్వేచ్ఛగా వెనక్కు తీసుకోవచ్చని ఆయన సవాలు విసిరారు.

తాను సైకిల్ ను మాత్రమే ప్రేమిస్తానని, ఇప్పుడు సైకిలు వేగంగా దూసుకుపోయే సమయమని ఆయన అన్నారు. సమాజ్‌పార్టీ చిహ్నం సైకిలని ఆయన గుర్తు చేశారు. బిజెపి నాయకుడి నుంచి బెదిరింపు ఫోన్ కాల్ మెసేజ్ వచ్చిందని, ఈమేరకు లక్నోలో రెండు మూడు రోజుల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పారు. అఖిలేష్ వ్యాఖ్యలపై అసెంబ్లీ వ్యవహారాల మంత్రి సురేష్‌కుమార్ ఖన్నా స్పందిస్తూ అఖిలేష్‌కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉందని, ఈ పరిధిలో 182 మంది భద్రతా సిబ్బంది ఉన్నారని వివరించారు.

Akhilesh Yadav alleged he received threats from BJP leader