Home Default వెబ్ సిరీస్ లో అక్కినేని నాగచైతన్య

వెబ్ సిరీస్ లో అక్కినేని నాగచైతన్య

Akkineni Nagachaitanya Will Act In Web Seriesహైదరాబాద్ :  ప్రముఖ టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య ఒటిటి బాటపట్టారు. ఓ హారర్‌ కథతో రూపొందే వెబ్ సిరీస్‌లో  నటించేందుకు ఆయన అంగీకరించారు. ఈ వెబ్ సిరీస్ లో నాగచైతన్య నెగెటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. అమెజాన్‌ ప్రైమ్‌లో కోసం తీస్తున్న వెబ్ సిరీస్ లో తాను నటిస్తున్నట్టు నాగచైతన్య తెలిపారు. ఈ వెబ్ సిరీస్ కు విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారని ఆయన వెల్లడించారు. ఈ వెబ్ సిరీస్ లో తాను నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఎప్పడూ చేయని పాత్రలో నటించడం తనకు కొత్తగా ఉందని ఆయన పేర్కొన్నారు. తన పాత్ర సవాల్ విసిరేదిగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ వెబ్ సిరీస్ కరోనా కంటే ముందు రావాల్సి ఉన్నప్పటికీ , పరిస్థితులు అనుకూలించకపోవడంతో డిసెంబరు లో మొదలు పెడుతున్నామని నాగచైతన్య తేల్చిచెప్పారు.