Home జాతీయ వార్తలు ఒబామా ఎప్పుడూ అదే అడిగే వారు

ఒబామా ఎప్పుడూ అదే అడిగే వారు

PM-Modi

న్యూఢిల్లీ: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా 2015 ప్రారంభంలో మొదటిసారి ప్రధాని మోడీని తొలిసారి కలిసినప్పుడు వారిద్దరి మధ్య సంభాషణల్లో ముందుగా ప్రస్తావనకు వచ్చిన అంశం మోడీ నిద్ర గురించే. ‘ మీరు రోజుకు మూడు నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతారట. ఎందుకు?’ అని బబామా అడిగారట. ఆ తర్వాత కూడా వారిద్దరు కలిసిన ప్రతిసారి కూడా ఒబామా ఇలాగే అడిగే వారట. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ప్రధాని నరేంద్ర మోడీని బుధ వారం ఇంటర్వ్యూ చేశారు. విలేఖరి కాని వ్యక్తికి ప్రధాని ఇంటర్వూ ఇవ్వడం ఇదే మొదటిసారి. ఈ ఇంటర్వూలో రాజకీయాల గురించి మాట్లాడనని అక్షయ్ కుమార్ ముందుగానే చెప్పారు. మోడీకి సంబంధించిన వ్యక్తిగత విషయాలపైనే ఇంటర్వూ పూర్తిగా సాగింది. ఇందులో భాగంగా అక్షయ్‌కుమార్ మోడీ నిద్ర గురించి అడిగారు.‘ మీరు రోజుకు మూడు నాలుగు గంటలు మాత్రమే నిద్ర పోతారని విన్నాను. ఎందుకలా?’అని అక్షయ్ కుమార్ అడిగారు. దీనికి సమాధానంగా అమెరికా అధ్యక్షుడుగా బరాక్ ఒబామా ఉన్నప్పుడు మొదటిసారి ఆయనను కలు సుకున్న సంఘటనను గుర్తు చేసుకున్నారు.తనను మొద టిసారి కలుసుకున్నప్పుడు ఒబామా కూడా ఇదే ప్రశ్న అడిగారని మోడీ చెప్పారు. ఆ తర్వాత కూడా తామిరు వురమూ కలిసినప్పుడల్లా ఒబామా ముందుగా ఇదే విషయం ప్రశ్నించే వారని మోడీ చెప్పారు.‘ మీరు నిద్రపో యే సమయాన్ని పెంచారా? లేదంటే అంతే సమయం పడుకొంటున్నారా?’ అని ఒబామా తనతో అన్నట్లు మోడీ చెప్పుకొచ్చారు.
ఇతర పార్టీల్లోనూ మంచి మిత్రులున్నారు
మీకు ఇతర పార్టీల్లో స్నేహితులున్నారా? అని ప్రశ్నించగా చాలా మంచి మిత్రులున్నారు. కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్, తాను చాలా మంచి మిత్రులమని చెప్పారు. అంతెందుకు ప్రతి రోజూ తనను తిట్టిపోసే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికీ తనకు ప్రతి ఏటా రెండు కుర్తాలు పంపిస్తుంటారని చెప్పారు. అలాగే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అప్పుడప్పుడు స్వీట్లు పంపుతుంటారన్నారు.
అందుకే కుటుంబానికి దూరంగా..
‘మీ తల్లి, కుటుంబంతో కలిసి ఉండలేకపోతున్నానని మీకు ఎప్పుడైనా అనిపించిందా?’ అని అడగ్గా తాను చిన్నప్పుడే కుటుంబాన్ని, అన్నింటిని వదులుకొని దూరంగా వచ్చే శానని, ఇప్పుడున్న పదవి వల్ల అమ్మకోసం సమయాన్ని కేటాయించలేకపోతున్నానని చెప్పారు. ఇప్పటికీ అమ్మను కలవడానికి వెళ్లినప్పుడు ‘ఎందుకు పనులు మానుకుని సమయాన్ని వృథా చేసుకుంటావు’ అని అంటూ ఉంటారు. అమ్మను ఇంటికి తీసుకు వచ్చినప్పుడు పనుల వల్ల రాత్రి వేళ ఇంటికివస్తుంటాను. ఆమెను కలవడానికి వీలుండదు. అందుకే అమ్మ నేనున్న ప్రదేశానికి రావడానికి ఇష్టపడదు అని చెప్పారు. ఎంఎల్‌ఏ అయినప్పుడు తాను తొలిసారిగా బ్యాంక్ ఖాతా తెరిచానని చెప్పిన ప్రధాని, డబ్బు వల్ల ఎలాంటి ఉపయోగం లేదని తాను భావిస్తానని, అందుకే సెక్రటేరియట్‌లో డ్రైవర్‌గా, ప్యూన్‌గా పని చేసే వారి పిల్లల పేరిట రూ.21 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశానని చెప్పారు.

‘నేను మోడీ సర్‌ను ఇంటర్వూ చేయడానికి వెళ్తున్నాను, నువ్వేమయినా ఆయనను అడగాలనుకుంటున్నావా’ అని తాను తన డ్రైవర్ కూతుర్ని అడగ్గా ఆ అమ్మాయి ‘ మొడీ సర్ మామిడి పండ్లు తింటారా?’ అని అడిందని అక్షయ్ కుమార్ చెప్పగా, మోడీ నవ్వేస్తూ ,తనకు మామిడి పండ్లంటే ఎంతో ఇష్టమని, అయితే ఇప్పుడు ఎక్కువ తినాలనుకున్నా ఆలోచించాల్సిన స్థితి అని అన్నారు. అంతేకాదు తనకు సహజంగా పండిన మామిడి పండ్లంటేనే ఇష్టమని కూడా ఆయన చెప్పారు. ఒక వేళ మీకు అల్లావుద్దీన్ అద్భుత దీపం దొరికితే.. నాలుగు కోరికలు కోరుకొమ్మని అడిగితే ఏం కోరుకుంటారని ప్రశ్నించగా… ‘నిజంగా అల్లావుద్దీన్‌కు అడిగింది నెరవేర్చే శక్తి ఉంటే.. ఈ దేశంలోని విద్యావేత్తలు, సామాజికవేత్తల మనసులో భావి తరాలకు అల్లావుద్దీన్ కథ చెప్పకుండా ఉండేలా చేయమని కోరుకుంటా. దానికి బదులు కష్టపడాలని చెప్పేలా చేయమని కోరుకుంటా’ అని ప్రధాని చెప్పారు.

Akshay Kumar interviews Prime Minister Narendra Modi