Home జాతీయ వార్తలు అస్సాం వరద బాధితులకు అక్షయ్ భూరీ విరాళం

అస్సాం వరద బాధితులకు అక్షయ్ భూరీ విరాళం

Akshay Kumarముంబయి : బాలీవుడ్ అగ్రనటుడు అక్షయ్ కుమార్ తన మంచి మనస్సును చాటుకున్నారు.  గతంలో నేపాల్ భూకంప, చెన్నయ్, కేరళ వరద బాధితులకు అధిక మొత్తంలో అక్షయ్ విరాళం ఇచ్చిన విషయం తెలిసిందే.  తాజాగా ఆయన అస్సాం వరద బాధితులకు రూ.2 కోట్లు విరాళంగా ప్రకటించి మానవత్వం చాటుకున్నారు. తాను అందించిన సాయంలో కోటి రూపాయలను అస్సాం సిఎం రిలీఫ్ ఫండ్ కు అందించారు. మరో కోటి రూపాయలను కజిరంగ నేషనల్ పార్క్ కు సాయంగా అందించారు. అస్పాం వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని ఆయన సినీ, రాజకీయ, స్వచ్ఛంద సంస్థలను కోరారు. భారీ వర్షాల కారణంగా అస్సాం ప్రజలు అతలాకుతలమైన విషయం తెలిసిందే. వందమందికి పైగా చనిపోయారు. సుమారు 45 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. యూనిస్కో గుర్తింపు ఉన్న కజిరంగ నేషనల్ పార్క్ 90 శాతం నీట మునిగిపోవడంతో అక్కడ ఉండే మూగ జీవాల పరిస్థితి దయనీయంగా మారంది.
Akshay To Donate Rs2 Crore for Assam Flood Victims