Home తాజా వార్తలు ‘రాములో రాములా…‘ సాంగ్ వాయిదా

‘రాములో రాములా…‘ సాంగ్ వాయిదా

 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న క్రేజీ మూవీ ‘అల వైకుంఠపురంలో’. ఈ చిత్రంలో బన్నీ సరసన రెండోసారి పొడుగుకాల సుందరి పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, రాధాకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా, ఇటీవల విడుదల చేసిన ‘సామజవరగమన…’ పాట రికార్డు వ్యూస్ తో బజ్ క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఈ పాటకు 40 మిలియన్‌ల వ్యూస్, 7 లక్షల లైక్స్ వచ్చాయి. తెలుగులో ఒక సాంగ్‌కు ఇన్ని లైక్స్ , వ్యూస్ రావడం ఇదే ప్రథమం. ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ఈ గీతానికి తమన్ స్వరాలు అందించగా… గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించాడు.

కాగా, ఇదే ఊపులో చిత్రయూనిట్ రెండో పాటను విడుదల చేయాలనుకున్నారు. ఈ సందర్భంగా అక్టోబర్ 21 సాయంత్రం 4 గంటలకు ‘రాములో రాములా…‘ అనే పాటను విడుదల చేస్తామని ప్రకటించారు. చేతిలో మందు గ్లాసుతో బన్నీ మంచి ఊపులో ఉన్న ఈ సాంగ్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. దీంతో ఈ పాటకోసం బన్నీ అభిమానుల ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే, చిత్రయూనిట్ మాత్రం అభిమానుల ఆశలపై నీళ్లు చల్లారు. కొన్ని కారణాల వల్ల ఈ పాటను రేపటకి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో టబు, రాజేంద్రప్రసాద్, తనికెళ్ల భరణి, మురళీ శర్మ, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్ని వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు చిత్రయూనిట్.

Ala VaikuntaPuramlo Movie Unit Disappoints Bunny Fans