Saturday, April 20, 2024

మద్యం డోర్ డెలివరీ..!

- Advertisement -
- Advertisement -

Alchohol

 

– లాక్ డౌన్ బేఖాతరు
– మూడు, నాలుగు రెట్ల్ల
అధిక ధరలకు సరఫరా
– మందు బాబుల జేబులు గుల్ల

మన తెలంగాణ/సంగారెడ్డి ప్రతినిధి: లాక్ డౌన్ కారణంగా మందు బాబులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు మూడు నాలుగు రెట్ల్ల అధిక ధరలకు మందు సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఎక్సైజు శాఖ కొంత మేర కు నిద్రపోతుండగా, కొన్ని చోట్ల అక్రమ వ్యాపారుల తో కుమ్మక్కయినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నిత్యావసర సరుకులు మినహా, వ్యాపార, వాణిజ్య సముదాయాలన్ని మూత పడ్డాయి. మూత పడిన వాటిలో బార్లు, వైన్ షాపులు కూడా ఉన్నాయి. అయితే ఇంట్లోనే క్షేమంగా ఉండి దేశాన్ని కాపాడే అవకాశం అనేక మందికి ఇబ్బందిగా మారింది. రోజు వారీ చుక్క పడితే కానీ, మనసు స్థిమితంగా ఉండని వారు ఇంకొందరున్నారు. వీరికి మొ దట్లో ఇబ్బంది లేకపోయినా రానురాను ఇబ్బంది అయింది. మందు దొరకడం లేదు. ఫలితం ఆ మద్య ం కోసం వారు అడ్డదారులు తొక్కుతున్నారు.

ఇదే అదనుగా భావించిన కొందరు మద్యం వ్యాపారులు, వారి వద్ద పనిచేసే వారు, ఇతరులు వ్యాపారం జోరు పెంచారు. ఐదారు వందలు ఉండే ఫుల్ బాటిల్, విస్కీ ని రెండు నుంచి మూడు వేలకు సరఫరా చేస్తున్నారు. ఇక వెయ్యి, ఆ పైన ధర ఉండే మందును రెండున్నర నుంచి మూడు వేలకు విక్రయిస్తున్నారు. ఇక బీరు బాటిళ్లు కూడా గతంలో వంద రూపాయలుండే దాన్ని ఇప్పుడు మూడు వందలకు విక్రయిస్తున్నారు. ఇద ంతా నిత్యావసర సరుకుల లాగా డోర్ డెలీవరీ చేస్తున్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డితో పాటు జిల్లాలో ని వివిధ ప్రాంతాల్లో ఈ దందా దర్జాగా సాగుతోంది. డివిజన్ కేంద్రాలు, మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలు..ఇలా ఒక్కటేమిటి అన్ని చోట్లా ఈ వ్యాపా రం సాగుతోంది. దూర ప్రాంత దుకాణాల నుంచి పట్టణాలకు మందు సరఫరా అవుతుందంటే వీరి స్కెచ్ ఎంత పకడ్బందీగా ఉందో ఆలోచించవచ్చు. ఇక మారుమూల మండలాల్లో, గ్రామాల్లో బెల్ట్ షాపులు విజృంభిస్తున్నాయి.

వారికి మందు ఎక్క డి నుంచి సరఫరా అవుతుందో? అది ఏ విధంగా ఆయా గ్రామాలకు చేరుతుందో ఎక్సైజు అధికారులకే తెలియాలి. సాయంత్రం అయితే చాలు మందు డోర్ డెలీవరీ జరుగుతుంది. అన్ని రకాల బ్రాండులు లభిస్తున్నాయి. ప్ర భుత్వం లాక్ డౌన్ ప్రకటించినా, పోలీస్ నిఘా కొనసాగుతున్నా..సాయంత్రం పూట కర్పూ ఉన్నా.. ఇవే వి మందు దందా ముందు పనిచేయడం లే దు. ద ర్జాగా చేరాల్సిన చోటికి మందు చేరుతోంది. అమ్మాల్సి న ధరకు అక్రమార్కులు అమ్ముకుంటున్నారు. ఇక ఎ క్సైజ్ వారి నిఘా ఏమైందంటే.. వారికే తెలియాలి. ఈ మొత్తం ఎపిసోడ్‌లో మందు బాబులు జేబులు గుల్ల చే సుకుంటున్నారు. నిత్యం వేలాది రూ పాయలు ఖర్చు చేస్తున్నారు. మందు తాగకుంటే ఆరోగ్యం దెబ్బతింటుందన్న సాకుతో కొంత మంది ఎ గబడి మరీ తాగుతున్నారు. ఇంకొందరు జల్సాలకు అలవాటు పడి, ఇప్పుడు కూడా కిక్కును వీడడం లేదు. ఈ తరుణంలో వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.

 

Alchohol supply at high prices
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News