Home జాతీయ వార్తలు మద్యం అక్రమ రవాణాపై ప్రత్యేక చర్యలు

మద్యం అక్రమ రవాణాపై ప్రత్యేక చర్యలు

ఇరు రాష్ట్రాల అధికారులతో సంప్రదింపులు
అక్రమ మద్యం నివారణకు అంతర్‌రాష్ట్ర చెక్‌పోస్టులు
32మంది సిబ్బంది నియామకం
ఎన్నికల నోడల్ అధికారి, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఖురేష్
LEQUORమన తెలంగాణ, నారాయణఖేడ్: మూడు రాష్ట్రాల సరిహద్దుగల నారాయణఖేడ్ ప్రాంతానికి అక్రమ మద్యం రవాణా కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్నికల నోడల్ అధికారి, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఖురేష్‌లు తెలిపారు. ఉప ఎన్నికల దృష్టా నియోజకవర్గ సరిహద్దులైన కరస్‌గుత్తి, దెగుల్‌వాడీ, గౌడ్‌గాంముల వద్ద అంతర్‌రాష్ట్ర చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలి పారు. ఖేడ్ పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో ఆయన మాట్లాడుతూ మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఖేడ్ ప్రాంతం ఉన్నందున అక్రమ మద్యం వచ్చే అవకాశం ఉందని, ఉప ఎన్నికల సందర్భంగా పై భద్రతలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల స్టేట్ అధికారి భన్వర్‌లాల్ ఆదేశాల మేరకు మద్యం రవాణాపై చర్యలు తీసు కుంటున్నామన్నారు. ఎన్నికల నోడల్ అధికారిగా తనను నియ మించారని, చెక్‌పోస్టులతో పాటు రూట్ల వారిగా 32మంది ఎక్సైజ్ సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. ఎన్‌సీసీ, వీఎస్టీ, ఎస్‌ఎస్‌టీల పర్యవేక్షణ సైతం భారీగా కొనసాగుతుందన్నారు. ఎన్నికల నియామవళిపై ప్రత్యేక శ్రద్ధను ఉంచామన్నారు. అభ్యర్థు లు, నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయవద్దన్నారు. ఎన్నికల ఖర్చుపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. ఓటుహక్కును స్వచ్ఛందంగా వినియోగించుకునేందుకు ఓటుహక్కు వినియోగదారు లకు సహకరించాలని కోరారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.
రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశం …
మహారాష్ట్ర, కర్ణాటక ఎక్సైజ్ అధికారులతో సమావేశమై అక్ర మ మద్యం రవాణాపై చర్చలు కొనసాగించినట్లు ఆయన పేర్కొ న్నారు. ముఖ్యంగా ఇల్లీగల్ లిక్కర్లు వచ్చే ప్రమాదం ఉన్నందున ఎన్నికల దృష్టా ఆ రాష్ట్ర అధికారులతో సమావేశమైనట్లు తెలిపారు. గత సంవత్సరం జనవరి, ఫిబ్రవరి మాసాల్లో సరఫరా చేసిన మద్యం లిమిట్ మాదిరిగానే ప్రస్తుత జనవరి, ఫిబ్రవరి నెలలో సరఫరా చేస్తామన్నారు. ఎన్నికల సంద ర్భంగా జిల్లా మొత్తం వైన్స్ యజమానులకు గత సంవత్సరం పద్ధతిలోనే ఈ రెండు నెలలు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. అంతకు ముందు మనూరు మండలం రాయిపల్లి ప్రాంతంలో ఉన్న చెక్‌పోస్టును తనిఖీ చేయడం జరిగిందన్నారు. అక్రమ మద్యం నిల్వలు, రవాణాపై సమాచారం అందించాలని వారి వివరాలను గోప్యంగా ఉంచి నేరస్తులపై చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ డేవిడ్వ్రికాంత్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ రంగరాము, సైదులు, సీఐలు శ్రీనివాస్, రాజుప్రకాశ్, ఎస్‌ఐ సూర్యప్రకాశ్, సిబ్బంది ఉన్నారు.