Friday, April 26, 2024

మిడుతల దండుతో ఆదిలాబాద్‌కు ముప్పు..

- Advertisement -
- Advertisement -

locust swarms

మన తెలంగాణ/నిర్మల్: ప్రస్తుతం దేశం మొత్తం కరోనా వైరస్‌తో పోరాడుతున్న సమయంలో మూలిగె నక్కపై తాటికాయ పడ్డట్లు అనే చందంగా మరో ముప్పు మిడతల రూపంలో రానుంది. ఇప్పటికే ఈ మిడతలు ఉత్తరాదిలో పంటలను నాశనం చేసి తెలంగాణ వైపుకు వస్తున్నాయనే సాంకేతాలు ప్రభుత్వానికి అందాయి. దీంతో ఈ మిడతలను అరికట్టడంతోపాటు ఎలాంటి పంట నష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖకు ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అప్రమత్తం అయిన వ్యవసాయాశాఖ మహారాష్ట్ర నుండి మిడతల దండు తెలంగాణకు చేరుకునే అవకాశం ఉన్నందున నియంత్రణకు ముందస్తూ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల్ జిల్లాలు మహారాష్ట్ర సరిహద్దున ఉన్నందున ఇక్కడి జిల్లా కలెక్టర్లు జిల్లా స్థాయి కమిటిలను ఏర్పాటు చేసి అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు.ఇప్పటికే మహారాష్ట్రలోని వేలాది ఎకరాల పంటలను నాశనం చేసిన ఈ మిడతలు తమ జిల్లాలో ప్రవేశించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రవేశించిన తరువాత చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ మిడతల దండు గంటకు 12 నుండి 15 కిలో మీటర్ల వేగంతో ప్రయణిస్తాయని, ఇవి చెట్లపై ఆవాసం ఏర్పాటు చేసుకొని పంటలకు భారీ నష్టం కలిగిస్తాయని తెలిపారు. అయితే వీటిని జిల్లాలో సమర్థవంతంగా ఎదురుకొనే విధంగా అధికారులు ప్రణాళికబద్దంగా ఎలా వ్యవహరించాలో జిల్లా కలెక్టర్లు దిశనిర్థేశం చేస్తున్నారు.

అస్సలే కరోనా వైరస్ వ్యాప్తితో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో.. తినడానికి తిండి కూడా దొరుకని విధంగా మరో ముప్పు ఈ మిడతల రూపంలో వచ్చిందంటున్నారు. రైతులను క్షేత్రస్థాయిలో వ్యవసాయశాఖాధికారులు అవగాహణ కల్పించడంతో పాటు మిడతల దండును ఎదురుకునే విధంగా చైతన్యపర్చాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్లు వ్యవసాయాశాఖాధికారులకు సూచిస్తున్నారు.జిల్లాలో మిడతలు ప్రవేశించే నిర్థారిత సమయాన్ని రైతులకు ముందస్తుగా తెలియజేసేలా అధికారులు వ్యవహరించనున్నారు. మిడతల నివారణకు అగ్నిమాపకశాఖ అధికారులతో కలిసి అవసరం అయిన ప్రాంతాల్లో స్ప్రే నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రైతుల వివరాలను గ్రామ, మండల వారిగా సిద్దం చేస్తూ శాస్త్రవేత్తల సూచనల మేరకు మిడతల దండును అరికట్టేందుకు ఆయా జిల్లాల యంత్రాంగం సిద్దం అయింది.

 Alerts in Adilabad because of locust swarms

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News