Home తాజా వార్తలు అసెంబ్లీలో కంటతడి పెట్టిన ఎంఎల్ఎ గొంగిడి సునీత

అసెంబ్లీలో కంటతడి పెట్టిన ఎంఎల్ఎ గొంగిడి సునీత

Aleru MLA Gongidi Sunithaహైదరాబాద్: డయాలసిస్ వ్యాధిగ్రస్తులపై అసెంబ్లీలో చర్చ జరగుతున్న సమయంలో ఆలేరు ఎంఎల్ఎ గొంగిడి సునీత కంటతడి పెట్టారు. డయాలసిస్ వ్యాధిగ్రస్థుల బాధలను ఆమె సభ్యులకు వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. డయాలసిస్ సమస్యతో బాధపడే వారి కుటుంబాలు మానసికంగా, ఆర్థికంగా చితికిపోతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫ్లోరోసిస్ వ్యాధి అధికంగా ఉండడంతో కిడ్నీస్ ఫెయిల్యూర్ అనేది జరుగుతుందని తనకు ఫిర్యాదులు వస్తున్నాయని ఆమె చెప్పారు. తన తండ్రి సైతం డయాలసిస్ సమస్యతో బాధపడ్డారని, అప్పుడు ఆర్ధికంగా ఎంతగానో చితికిపోయామని సునీత తెలిపారు. డయాలసిస్ సమస్యతో బాధపడే వారికి కూడా పింఛన్లు ఇవ్వాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.

Aleru MLA Gongidi Sunitha Speech In Assembly