Home ఆఫ్ బీట్ స్మార్ట్ వాలెట్

స్మార్ట్ వాలెట్

22
కొన్ని సందర్భాలలో వాలెట్ మర్చిపోవడం అందరికీ అనుభవమే. పోయిన వస్తువు తిరిగి రావడం అనేది అసాధ్యం. ఇలా ఆఫీసు, హోటళ్లు లాంటి ప్రదేశాల్లో వాలెట్‌లను మర్చిపోతే..అనే సమస్యకు పరిష్కారంగా వయోగర్ స్మార్ట్ వాలెట్ అందుబాటులోకి వచ్చింది. బ్లూటూత్ ద్వారా ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే పర్సు మర్చిపోయి, కొన్ని అడుగుల దూరం వెళ్లినప్పుడు ఫోన్‌కు నోటిఫికేషన్ వస్తుంది. మనం వెంటనే అలెర్ట్ అయ్యి వెనక్కు వెళ్లి వాలెట్‌ను తీసుకోవచ్చు. అంతేకాకుండా ఫోన్ ఎక్కడ పెట్టామో మర్చిపోయినా, కనిపించకపోయినా ఈ వాలెట్‌లోని బటన్‌ను నొక్కితే అది రింగ్ అవుతుంది. దాంతో ఫోన్ ఎక్కడుందో తెలుసుకోవడం సులభం. మొబైల్‌ను మన ఎదురుగా ఉంచి వాలెట్‌లోని బటన్‌ను నొక్కి సెల్ఫీ తీసుకునే సదుపాయం ఉంది. ధర రూ. 3,699.cuirally.comలో ఆర్డరిచ్చి తెప్పించుకోవచ్చు.

మెడనొప్పికి అలెక్స్

23

స్మార్ట్‌ఫోన్, లాప్‌టాప్, డెస్క్‌టాప్‌లను గంటలకొద్దీ వాడటం వల్ల చాలా మందికి మెడ నొప్పి, వెన్నునొపి అనేవి సర్వసాధారణంగా మారింది. మెడను సరిగ్గా వంచనప్పుడే ఇలాంటి సమస్యల బారిన పడుతుంటారు. అలెక్స్ అనే పరికరాన్ని మెడపై ధరిస్తే సరి. యాప్, వైఫైతో దీన్ని స్మార్ట్ ఫోన్‌కు అనుసంధానించవచ్చు. మనం సిస్టమ్‌ను ఉపయోగించి పనిచేస్తున్నప్పుడు మెడను ఎలా వంచాలో ఈ పరికరం చూపిస్తుంది. ఎన్ని గంటలు మెడను ఒకే కోణంలో ఉంచామో చెబుతుంది. మెడను వంచే విధానం, కూర్చునే పద్ధతి సరిగ్గా లేనప్పుడు వైబ్రేషన్స్ ద్వారా సరిచేస్తుంది.

స్మెల్ స్పీకర్

21
మనసుకు నచ్చే సంగీతం హాయినిస్తుంది. అందులో స్పీకర్ల నుంచి వినబడే మ్యూజిక్ డాన్స్ ఆడించక మానదు. అలాంటిది స్పీకర్ల నుంచి సువాసనలు వెదజల్లితే మరింత మజా వస్తుంది. సైరనో అనే స్మెల్ స్పీకర్లు సవాసనలు వెదజల్లుతాయి. పాటలకు అనుగుణంగా ఏకంగా 12 రకాల పరిమళాలను అందిస్తాయి. హార్వర్డ్ విశ్వవిద్యా లయానికి చెందిన డేవిడ్ ఎడ్వర్డ్ అనే గాడ్జెట్ నిపుణుడు, ఔత్సాహిక వ్యాపారవేత్త ఈ కొత్త పరికరాన్ని రూపొందించాడు. స్మార్ట్‌ఫోన్‌తో కూడా దీన్ని ఆపరేట్ చేయొచ్చు. ధర పదివేల రూపాయలు.