Friday, April 26, 2024

మాడ్రిడ్ ఓపెన్ విజేత జ్వరేవ్

- Advertisement -
- Advertisement -

Alexander Zverev won in Madrid Open title

 

బార్సిలోనా : జర్మనీ సంచలనం, ఐదో అలెగ్జాండర్ జ్వరేవ్ ప్రతిష్టాత్మకమైన మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో ఇటలీకి చెందిన ఎనిమిదో సీడ్ మాటియో బెరిటెనిను ఓడించాడు. మూడు సెట్ల సమరంలో జ్వరేవ్ 67, 64, 63తో విజయం సాధించాడు. ఆరంభం నుంచే పోరు ఆసక్తికరంగా సాగింది. ఇద్దరు ప్రతి పాయింట్ కోసం నువ్వా నేనా అన్నట్టు తలపడ్డారు. దీంతో పోరు టైబ్రేకర్ వరకు వెళ్లక తప్పలేదు. ఇందులో చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడు కోవడంలో సఫలమైన బెరిటెని సెట్‌ను సొంతం చేసుకున్నాడు. కానీ తర్వాతి రెండు సెట్లలో జ్వరేవ్ పుంజుకున్నాడు. ప్రత్యర్థి ఆధిపత్యానికి అడ్డుకట్ట వేస్తూ లక్షం దిశగా అడుగులు వేశాడు. ఇదే క్రమంలో వరుసగా రెండు సెట్లు గెలిచి మ్యాచ్‌తో పాటు టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్‌కు సన్నాహకంగా నిర్వహించిన ఈ టోర్నీలో పలువురు అగ్రశ్రేణి క్రీడాకారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News